పియర్ సాగులో పాటించవలసిన మెలకువలు..!

పండ్ల రకాలలో ఒకటైన పియర్ పండ్లను( Pears ) సీజనల్ ఫ్రూట్ గా చెప్పుకోవచ్చు.

ఇందులో ఫైబర్ మరియు ఐరన్ ఉండడంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడడంతో మార్కెట్లు దీనికి డిమాండ్ ఉంది.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 600 నుండి 700 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.

అంటే ఒక చెట్టు నుండి దాదాపుగా రెండు క్వింటాళ్ల వరకు ఉత్పత్తి పొందవచ్చు.

పియర్ సాగును( Pears Cultivation ) చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, చలి తక్కువగా ఉన్న ప్రాంతాలలో నేల యొక్క స్వభావాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా మూడు వేల కంటే ఎక్కువగా బేరి జాతులు అందుబాటులో ఉన్నాయి.భారతదేశంలో 20 రకాల పండ్లను మాత్రమే పండిస్తున్నారు.

ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.

"""/" / 10 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే నెలలలో అధిక దిగుబడి పొందవచ్చు.

తేమతో కూడిన ఎత్తైన ప్రాంతాలలో, పొడి సమశీతోష్ణ ప్రాంతాలలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

మొదట నేలను దుక్కి దున్ని, సూర్యకిరణాలు భూమిలో పలికి పడే విధంగా ఎండనివ్వాలి.

20 నుండి 25 రోజుల వయసు ఉండే ఆరోగ్యమైన మొక్కలను ఎంచుకోవాలి.ఇక మొక్కల మధ్య 8*4 మీటర్ల దూరం ఉండేటట్టు నాటుకోవాలి.

"""/" / నేలలో ఉండే తేమ శాతాన్ని( Moisture ) బట్టి వేసవిలో అయితే వారానికి ఒకసారి, శీతాకాలంలో రెండు వారాలకు ఒకసారి నీటి తడులు డ్రిప్ పద్ధతి ద్వారా అందించాలి.

ఇక పంట చేతికి రావడానికి 150 రోజుల సమయం పడుతుంది.మొక్కల చుట్టూ ఎప్పటికప్పుడు కలుపు ను తొలగిస్తూ ఉండాలి.

పియర్ పండ్లను 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద బాక్స్ లో నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.

ప్రస్తుతం మార్కెట్లో కిలో దాదాపుగా వంద రూపాయల ధర పలుకుతోంది.కాబట్టి మంచి ఆదాయం అర్జించవచ్చు.

ల‌వంగాల పాలు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే రోజూ తాగేస్తారు..!