డ్రాగన్ ఫ్రూట్ పంటను నాటుకునే విధానం లో పాటించాల్సిన జాగ్రత్తలు..!

తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు( Dragon Fruit Farming ) విస్తీర్ణం పెరుగుతోంది.

తక్కువ నీటి సౌకర్యం ఉండే నేలలలో ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చు.

గతంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట సాగును దిమ్మెలు పాతి దానిపై ఒక టైర్ అమర్చి, మొక్కలు పైకి పాకే విధంగా ఏర్పాటు చేసేవారు.

ఈ పద్ధతిని చాలామంది చూసే ఉంటారు. """/" / కానీ ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ) తోటలు అభివృద్ధి చేయవచ్చు.

సాలుల మధ్య 14 అడుగుల దూరం, దిమ్మెల మధ్య 14 అడుగుల దూరం ఉండేటట్లు దిమ్మెలు నాటుకోవాలి.

ఆ తరువాత కరెంట్ స్తంభాలకు విద్యుత్ తీగల లైన్ ఎలా వేస్తారో అలాగే.

ఈ దిమ్మెలకు కూడా నాలుగు వరసలతో లైన్ వేయాలి.దిమ్మెల కింద ఒకదాని పైన ఒకటి ప్రకారం మూడు వైర్లు లాగాలి.

ఈ వైర్ల కింద మొక్కల మధ్య అడుగు దూరం ఉండేటట్టు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటుకోవాలి.

ఈ మొక్కలు క్రమంగా పెరిగి పైన వేసిన నాలుగు లైన్ల తీగలకి అల్లుకుంటాయి.

ఇలా చేస్తే ఒక ఎకరం పొలంలో ఏకంగా 7 వేల మొక్కలు నాటుకోవచ్చు.

"""/" / ఈ పద్ధతిలో సాగు చేస్తే సాలుల మధ్య దూరం 14 అడుగులు ఉంటుంది కాబట్టి ఇతర పంటలను అంతర పంటగా కూడా సాగు చేసే అవకాశం ఉంటుంది.

ఇక డ్రాగన్ ఫ్రూట్ పంటకు కలుపు సమస్య( Weed Problem ) లేకుండా, మొక్కల వద్ద తేమ ఆరిపోకుండా ఉండాలంటే మల్చింగ్ షీట్లను ఉపయోగించాలి.

ఈ మల్చింగ్ వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.ఈ పద్ధతులు పాటించి సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.

బాలయ్య ఈ 7 ఏళ్ల లో ఆ ఒక్క సినిమా విషయం లోనే డేరింగ్ డిసిజన్ తీసుకున్నాడా..?