పొడుగు జుట్టు కోరుకునేవారు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే!

పొడుగు జుట్టు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు.అందాన్ని రెట్టింపు చేయ‌డంలో పొడ‌వాటి జుట్టుది ప్ర‌త్యేక స్థానమ‌ని చెప్పొచ్చు.

అందుకు అమ్మాయిలు జుట్టును పొడుగ్గా పెంచుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.ఈ క్ర‌మంలోనే కేశాల‌కు ఎంతో ఖ‌రీదైన నూనెలు, షాంపూలు, కండీష‌న‌ర్లు వాడ‌తారు.

అయితే ఇవి యూజ్ చేసినంత మాత్రానే జుట్టు పెరుగుతుంది అని అనుకోవ‌డం చాలా పొర‌పాటు.

నిజానికి పొడుగు జుట్టు కోరుకునే వారు ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో చూసేయండి. """/" / సాధార‌ణంగా స్ప్లిట్ ఎండ్స్ (జుట్టు చివ‌ర్ల పొట్లి పోవ‌డం) కార‌ణంగా హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.

అందు వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు స్ప్లిట్ ఎండ్స్‌ను క‌ట్ చేసేస్తూ ఉండాలి.త‌ద్వారా జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది.

అలాగే చాలా మంది వేడి వేడి నీటితో త‌ల స్నానం చేస్తుంటారు.ప్ర‌తి సారి ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తిని పెర‌గ‌డం ఆగిపోతుంది.

అందుకే త‌ల స్నానానికి చ‌ల్ల‌టి నీటిని లేదా గోరు వెచ్చ‌ని నీటిని మాత్ర‌మే యూజ్ చేయాలి.

లాంగ్ హెయిర్‌ కావాల‌నుకునే వారు ఎటువంటి హెయిర్ ప్యాకులు వేసుకున్నా, వేసుకోక‌పోయినా క‌ల‌బంద‌ను త‌ప్ప‌కుండా యూజ్ చేయాలి.

ఇంట్లో పెరిగే క‌ల‌బంద నుంచి జెల్ తీసుకుని జుట్టు మొత్తానికి ప‌ట్టించి గంట త‌ర్వాత హెడ్ బాత్ చేయాలి.

వారానికి ఒక సారి ఇలా చేస్తే జుట్టుకు మంచి పోష‌న అంది పొడ‌వుగా పెరుగుతుంది.

కొంద‌రు ఏదో ఒక కార‌ణం చేత రెగ్యుల‌ర్‌గా హెడ్ బాత్ చేస్తుంటారు.ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు డ్రైగా మారిపోయి గ్రోత్ క్ర‌మంగా ప‌డిపోతుంది.

అందుకే వారానికి రెండు సార్ల‌కు మించి త‌ల స్నానం చేయ‌కూడ‌దు. """/" / ఇక వాట‌ర్‌ను ఎక్కువ‌గా సేవించాలి.

తీసుకునే ఆహారంలో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా అన్ని పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి.

మ‌రియు పొల్యూష‌న్‌కు, ఎండ‌కు హెయిర్ ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్ర‌త్త తీసుకోవాలి.త‌ద్వారా మీ జుట్టు గ్రోత్ అద్భుతంగా ఉంటుంది.

అంతరిక్షంలో చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి వాడుకుంటున్న సునీతా విలియమ్స్..?