ప్రీ వెడ్డింగ్ వీడియో: తమ డాన్స్‌ను చూసుకొని తెగ నవ్వేసుకున్న వధూవరులు..!
TeluguStop.com
ప్రస్తుత రోజులలో పెళ్లిళ్లు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్,( Pre Wedding Shoot ) పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటూ అనేక షూటింగ్స్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.
పెళ్లికి ముందే చాలా వరకు భారీ స్థాయిలో ఖర్చులు పెట్టి మరి ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు కొందరు.
అందమైన ప్రదేశలలో వధూవరులు( Couple ) ఇద్దరు ఫోటోలు, వీడియోలు తీయించుకుంటూ ఉంటారు.
ఇలా అనేక ఫ్రీ వెడ్డింగ్ షూట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇలా వైరల్ అవుతున్న వీడియోలలో వారు చేసే వెరైటీ మూమెంట్స్, అలాగే విచిత్ర బంగిమలు లాంటివి ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
"""/" /
ఇక తాజాగా ఫ్రీ వెడ్డింగ్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు వారి పెళ్లి రోజున వచ్చిన బంధువులు, అతిధులకు చూపిస్తూ బాగా ఎంజాయ్ చేసారు.
అయితే ఇక్కడ విశేషమేమిటంటే.ఒక కొత్త జంట వారి ప్రీ వెడ్డింగ్ షూట్ లో వారిని వారే చూసుకుని తెగ నవ్వుకున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వివరాల్లోకి వెళ్తే.తమిళనాడులో( Tamil Nadu ) ఒక వధూవరులు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి అనంతరం వారి ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోలు చూస్తూ ఒక్కసారిగా వధువు తెగ సంబర పడిపోయింది.
ఇది చూసిన వరుడు కూడా చేతులు అడ్డుపెట్టుకొని మరి తెగ నవ్వుకున్నాడు. """/" /
దీనికి కారణం లేకపోలేదు.
, లావుగా ఉన్న వరుడు డాన్స్( Groom Dance ) చేసేందుకు ఇబ్బంది పడడం సినిమాటిక్ షార్ట్స్ కోసం సముద్ర ఒడ్డున వధూవరులు ఇద్దరు కూడా డాన్స్ చేసేందుకు ఇబ్బంది పడటం, అలాగే వధువుకు యాక్టింగ్ కొత్త అవ్వడంతో వీడియోను చూసిన వారందరిని ఒక్కసారిగా నవ్వించింది.
ఇక వీడియోలోని వారి నటనను చూసుకొని వధూవరులిద్దరూ కూడా తెగ నవ్వుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం ఫన్నీగా స్పందిస్తూ " జంట చూడముచ్చటగా " ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది నాకు దక్కిన గౌరవం… సల్మాన్ తో నటనపై రష్మిక కామెంట్స్!