అమెరికాలో ..బతుకమ్మ ,దసరా.. ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు

అమెరికాలో ఉంటున్న ఎంతో మంది ఎన్నారైలలో భారతీయ ఎన్నారైలు అధికశాతం మంది అయితే వీరిలో అత్యధిక శాతం తెలుగు ప్రవాశీయులు ఉండటం గమనార్హం.

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ అమెరికాలో కలిసి తెలుగు పండుగలని చేసుకుంటూ ఉంటారు.

అయితే త్వరలో రాబోయే బతుకమ్మ-దసరా సంబరాలని ఎంతో ఘనంగా నిర్వహించడానికి టీపాడ్ (తెలంగాణ పీపుల్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌) ముదస్తూ నిధుల సేకరణా కార్యక్రమాన్ని నిర్వహించింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రతీ ఏటా ముందుగా జరిగే నిధుల సమీకరణ కార్యక్రమంలో తెలుగు ప్రజలు అందరూ పాల్గొని తమవంతుగా సాయం చేస్తూ ఉంటారు.

అక్టోబర్‌ 13 ఉదయం 11 గంటలకు మొదలయ్యి రాత్రి వరకూ కూడా కార్యక్రమాలు జరుగనున్నాయి.

దాదాపు 12 వేల మంది ఈ వేడుకలో పాల్గొంటారు.ప్రతీఏటా టీపాడ్ ఈ వేడుకలని క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది.

అంతేకాదు క్రమం తప్పకుండా సంప్రాదాయ పద్దతిలో నిర్వహిస్తున్న టీపాడ్ కి తెలంగాణా ప్రభుత్వం కూడా గుర్తింపు ఇచ్చింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ సన్నాహక మీటింగ్ ని టీపాడ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్లు రూపా కన్నయ్యగారి, రోజా ఆడెపు అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిల్లలు అన్నమాచార్య కీర్తనలు ఆలపించగా.

సరస్వతీ ప్రార్థన చేసి ఈవెంట్‌ను ప్రారంభించారు.అనంతరం భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఆత్మచరణ్‌ రెడ్డి (నిజామాబాద్‌ మాజీ ఎంపీ)ల మృతిపై సంతాపం తెలిపారు.

అయితే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడం మాత్రమే కాకుండా 2 లక్షల డాలర్లు నిధులు పోగయ్యాయని టీపాడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించింది.

అక్రమ వలసదారుల ఏరివేత .. యాక్షన్‌లోకి ట్రంప్, గురుద్వారాలలో యూఎస్ ఏజెంట్ల తనిఖీలు