నీ సక్సెస్ కోసం ప్రార్థిస్తున్నా… విజయ్ దేవరకొండకు సమంత బర్త్ డే విషెస్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.

ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత ( Samantha ) తో కలిసి ఖుషి(Khushi) సినిమాలో నటిస్తున్నారు.

ఇకపోతే నేడు (మే 09) విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

"""/" / ఇలా విజయ్ దేవరకొండ పుట్టినరోజు ( Birthday ) జరుపుకుంటున్న నేపథ్యంలో అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కోస్టార్ సమంత కూడా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా విజయ్ దేవరకొండకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక విజయ్ దేవరకొండ పోస్టర్ ను షేర్ చేసిన సమంత తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.

"""/" / నా మంచి స్నేహితుడు, నా ఫేవరేజ్‌ కోస్టార్‌ విజయ్‌ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది.

నీ సక్సెస్‌ కోసం నేను ప్రార్థిస్తూ విషెస్‌ తెలియజేస్తున్నా ఎందుకంటే నువ్వు నిజంగా అన్నింటిలో బెస్ట్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నావు అంటూ సోషల్ మీడియా వేదికగా సమంత విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక వీరిద్దరూ ఖుషి సినిమా కంటే ముందుగానే మహానటి సినిమాలో కలిసిన నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

రాజమౌళి సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్ బాబు?