ఫైమా కోసం ఎంతో ఏడ్చా.. చివరకు రిజెక్ట్ చేసింది.. ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

జబర్దస్త్ షో( Jabardasth ) ద్వారా గుర్తింపును సంపాదించుకున్న కంటెస్టెంట్లలో ఫైమా ప్రవీణ్ ముందువరసలో ఉంటారు.

ఈ జోడీకి ప్రేక్షకుల్లో సైతం మంచి గుర్తింపు ఉంది.అయితే ఫైమా గురించి ప్రవీణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

ఫైమా( Faima )తో ప్రేమ అనేది స్నేహంతో మొదలైందని నా కెరీర్ తొలినాళ్ల నుంచి ఫైమా నాతోనే ఉన్నారని ప్రవీణ్ అన్నారు.

అందుకే లవ్ చేస్తున్నానని చెప్పానని ప్రవీణ్ తెలిపారు.అయితే ఫైమా మాత్రం నా ప్రేమను రిజెక్ట్ చేసిందని ప్రవీణ్ అన్నారు.

నా పరంగా చెప్పాల్సింది చెప్పానని ఆమెకు ఇష్టం ఉండొచ్చని ఉండకపోవచ్చని ప్రవీణ్( Praveen ) తెలిపారు.

ఫైమా నిర్ణయాన్ని నేను తప్పు పట్టలేనని ప్రవీణ్ తెలిపారు.నో చెప్పిందనే కారణంతో ఫైమాకు దూరంగా ఉండలేనని ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

మా మధ్య ప్రేమ లేకపోయినా ఫ్రెండ్స్ గా ఉందామని చాలా సందర్భాల్లో చెప్పానని ఆయన అన్నారు.

"""/" / ఒక మంచి స్నేహితునిగా ఆమె వెంట ఎప్పటికీ ఉంటానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

ఆమె నా ప్రేమను అంగీకరించలేదనే బాధ ఎక్కువగా ఉందని దీంతో ఒకానొక సమయంలో బాగా ఏడ్చానని ప్రవీణ్ కామెంట్లు చేశారు.

ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లెవ్ అంటారని అందుకే ఆమె కోసం ఏడ్చానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

మొదట బాధ పడినా తర్వాత రియలైజ్ అయ్యానని ప్రవీణ్ వెల్లడించారు. """/" / ప్రస్తుతం నా కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటి కోసం నేను పోరాడుతున్నానని ప్రవీణ్ పేర్కొన్నారు.

ఈ మధ్య మా నాన్నగారు చనిపోయారని నాన్న మరణం తర్వాత ఆయన అప్పుల గురించి తెలిసిందని ప్రవీణ్ వెల్లడించారు.

ఆ అప్పులను చెల్లించే పనిలో బిజీగా ఉన్నానని ఫైమా లవ్ చేస్తున్నానని చెబితే భవిష్యత్తులో కచ్చితంగా అంగీకరిస్తానని ప్రవీణ్ తెలిపారు.

ప్రవీణ్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ కు జాతీయ అవార్డ్.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!