ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే

నిరుద్యోగులకు కేసిఆర్, కేటీఆర్( KCR, KTR ) బహిరంగంగా క్షమాపణ చెప్పాలి వచ్చే ఎన్నికల్లో విద్యార్థి, నిరుద్యోగ గళం వినిపిస్తాము భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా:- డీఎస్సీ పరీక్షా వాయిదా పడటం తో మనస్థాపానికి గురి అయి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థి ప్రవళిక చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ,ఇది ముమ్మాటికి బిఆర్ఎస్ ప్రభుత్వ హత్యేనని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ అన్నారు.

ఈ సంధర్భంగా ఆయన వేములవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాల నినాదం తో ఎంతో విద్యార్థి అమరవీరుల ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రము లో మళ్లీ ఆత్మ హత్యలే దిక్కాయని అన్నారు.

నీళ్ల పేరున నిధులు దోచి ,నియామకాలు గాలికి వదిలేశారు అని అన్నారు.

ఏ ఉద్యోగాల కోసం అయితే రాష్ట్ర ఏర్పాటు కోరుకొన్నమో ,మళ్ళీ స్వరాష్ట్ర ములో కూడా ఉద్యోగాల కోసం కొట్లడితే గాని ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయని పరిస్తితి లో ప్రభుత్వము ఉందని అన్నారు.

ఇంటికో ఉద్యొగం అని మోసం చేసి,లక్ష ఉద్యోగ నోటిఫికేన్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఇచ్చిన ఏ ఒక్క నోటిఫికేన్లు కూడా సజావుగా జరుపలేని పరిస్థితుల్లో ఉందని .

పేపర్ లీకేజీలు , పరీక్షా వాయిదాల తో ఈ 5 సంవత్సరల కాలంగా విద్యార్థి నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటూన్నారని అన్నారు.

స్వరాష్ట్రలో ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడి,అప్పులు తెచ్చి మరి 2&3 సంవత్సరాల పాటు కోచింగ్ లు తీసుకుంటున్న బడుగు బహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఈ పేపర్ లికేజిలు, పరీక్షలు వాయిదాల తో , తెచ్చిన అప్పులు కట్టలేక , కన్నా వారికి సమాధానం చెప్పు కోలేక , నిరాశతో నీసృహలతో ,మనస్తపానికి గురి అయి ఆత్మహత్యలు చేసుకుట్టున్నారని,పేపర్ లీకేజీలను అరికట్టాలేని టిఎస్పిఎస్సి కూడా రద్దు చేయడం లేదని అన్నారు.

దీన్ని బట్టే అర్ధం అవుతుందని రాష్ట్ర నిరుద్యోగుల పై ఎంత ప్రేమ ఉందో అని విమర్శించారు.

వెంటనే ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్ర నిరుద్యోగులకు కేసిఆర్, కేటీఆర్ లు బహిరంగంగా క్షమాపనా కోరి, ఎలక్షన్లకి రావాలని అన్నారు.

లేదంటే విద్యార్థి , నిరుద్యోగ యువత అందరినీ ఏకం చేసి బిఆర్ఎస్ ప్రభుత్వన్ని గద్దెదించుతాని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో నాయకులు నరేష్, బాబు,అరుణ్ ,తేజ, విష్ణు, ప్రశాంత్ , తదితురులు పాల్గొన్నారు.

బాలయ్య 50 సంవత్సరాల సినీ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రానున్న ముగ్గురు స్టార్ హీరోలు…