రివ్యూ : 'ప్రతిరోజు పండుగే' అందరికా? కొందరికా?
TeluguStop.com
వరుసగా అరడజను సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇక సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఖతం అయ్యిందని భావిస్తున్న తరుణంలో చిత్రలహరి చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.
మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండి కూడా భారీగా ఉన్నాయి.
ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
H3 Class=subheader-styleకథ :/h3p
సినిమా ట్రైలర్‌లోనే మొత్తం కథను చెప్పడం జరిగింది.సత్యరాజ్ తన పిల్లలు అమెరికాలో సెటిల్ అవ్వడంతో పల్లెటూరులో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
అలాంటి సత్యరాజ్ కు క్యాన్సర్ వ్యాధి అని అది చివరి దశలో ఉందని డాక్టర్లు చెబుతారు.
ఈ కొన్ని రోజులు సంతోషంగా గడపమంటూ చెప్తారు.ఆ విషయం తెలిసిన సత్యరాజ్ మనవడు(సాయి ధరమ్ తేజ్) తాతను సంతోషంగా ఉంచాలని నిర్ణయించుకుంటాడు.
ఆయన కుటుంబ సభ్యులందరిని కూడా రప్పిస్తాడు.అయితే ఆ సమయంలో సత్యరాజ్ చాలా హెల్తీగా కనిపించడంతో అసలు ఆయనకు క్యాన్సర్ ఉందా అనే అనుమానం కలుగుతుంది.
ఇంతకు సత్యరాజ్‌కు క్యాన్సర్ ఉందా? చివరకు ఏమైంది? సినిమా కథ ముఖ్య ఉద్దేశ్యం ఏంటీ? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
H3 Class=subheader-styleనటీనటుల నటన : /h3p
హీరో సాయి ధరమ్ తేజ్ చాలా ఎనర్జిటిక్‌గా ఈ చిత్రంలో కనిపించాడు.
తాత కోసం తపన పడే మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు.మెచ్యూర్డ్ నటనను తేజ్ ఈ చిత్రంలో చూపించాడు.
పాటలు మరియు యాక్షన్ సీన్స్‌లో సాయి ధరమ్ తేజ్ ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్‌లో మెప్పించాడు.
ఇక హీరోయిన్ రాశిఖన్నాకు పెద్దగా స్కోప్ దక్కలేదు.టిక్ టాక్‌లో ఫేమస్ అయ్యి పోవాలనే కోరికతో ఆమె పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి.
సత్యరాజ్ మరియు రావు రమేష్‌లు ఎప్పటిలాగే ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు.
ఇక మిగిలిన వారు కూడా ఎంటర్‌టైన్ చేశారు. """/" /
H3 Class=subheader-styleటెక్నికల్ :/h3p
థమన్ అందించిన సంగీతం పర్వాలేదు అన్నట్లుగా ఉంది.
ఒకటి రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి.కొన్ని పాటలు చిత్రీకరణ బాగుంది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.కొన్ని సీన్స్ స్థాయిని పెంచే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది.
ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.కొన్ని సీన్స్‌లో పల్లె అందాలను చూపించిన తీరు చాలా బాగుంది.
ఫ్యామిలీ చిత్రం అన్నట్లుగా స్క్రీన్ నిండుగా నటీనటులను చూపిస్తూ మెప్పించాడు.దర్శకుడు మారుతి ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా తెరకెక్కించాడు.
ఎంటర్‌టైన్‌మెంట్‌తో స్క్రీన్‌ప్లేను సాగించాడు.దర్శకత్వం మెప్పించింది.
నిర్మాణాత్మక విలువలు ఆకట్టుకున్నాయి.h3 Class=subheader-styleవిశ్లేషణ :/h3p
మొదటి నుండి అనుకున్నట్లుగానే శతమానం భవతి చిత్రం తరహాలోనే ఈ చిత్రం ఉంది.
కాని కథ మరియు స్క్రీన్‌ప్లే పూర్తి విరుద్దంగా ఉంది.శతమానం సినిమాను చూసిన ఫీలింగ్ ఏమీ లేదు.
అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఆకట్టుకుంది.ఇక ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటన మరియు సత్యరాజ్ ల నటన హైలైట్ అని చెప్పాలి.
వీరిద్దరి కాంబో సీన్స్ చాలా మందికి రీచ్ అవుతాయి.ఇక దర్శకుడు మారుతి ఎంటర్‌టైన్‌మెంట్‌తో స్క్రీన్‌ప్లేను సాగించి ఆకట్టుకున్నాడు.
సంక్రాంతి సినిమా ముందే వచ్చిందా అనిపించేలా ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్ :/h3p
ఎంటర్‌టైన్‌మెంట్,
సాయిధరమ్ తేజ్ సత్యరాజ్‌ల కాంబో సీన్స్,
కొన్ని ఫ్యామిలీ సీన్స్
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్ :/h3p
ఎడిటింగ్,
కథనంలో పట్టు లేదు,
హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత లేదు.
H3 Class=subheader-styleబోటమ్ లైన్ : /h3p 'ప్రతి రోజు పండుగే' అందరు ఒకసారి చేసుకోవచ్చు.
H3 Class=subheader-styleరేటింగ్ : /h3p 2.75/5.
రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!