సలార్ విషయంలో ప్రశాంత్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే రికార్డులే?

కేజిఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ (Prabhas ) నటించిన చిత్రం సలార్(Salaar ) ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది.

అయితే అదే రోజే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హీరోగా నటించిన డుంకి సినిమా కూడా విడుదల కానుంది.

ఈ సినిమాకు డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీ కావటం విశేషం.ఇలాంటి ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) నటించిన సినిమాకి పోటీగా సలార్ ( Salaar ) సినిమా రంగంలోకి దిగుతోంది దీంతో ఏ సినిమా విజయం సాధిస్తుందన్న ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ ఉంది అని చెప్పాలి.

"""/"/ ఇక ఈ రెండు సినిమాలు ఒకేసారి బరిలోకి దిగడంతో కొందరు ప్రశాంత్ గత సినిమాల సెంటిమెంట్ల గురించి మాట్లాడుతూ ఎక్కువగా విజయం అందుకునే అవకాశం ప్రశాంత్ కే ఉందని భావిస్తున్నారు.

ప్రశాంత్ గత సినిమాల విషయానికి వస్తే ఈయన యశ్ హీరోగా నటించిన కే జి ఎఫ్ చాప్టర్ సినిమా( KGF ) 2018 డిసెంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అదే రోజు షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి జీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కేజీఎఫ్ సినిమా మాత్రం సంచలనాలను సృష్టించింది.

"""/"/ ఈ సినిమా తర్వాత కే జి ఎఫ్ చాప్టర్ 2( KGF Chapter 2 ) గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైనటువంటి విజయాన్ని అందుకుంది.

ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందింది.

ఇక ఈ సినిమాకి ఒక రోజు ముందు కోలీవుడ్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా( Beast ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.ఈవిధంగా చూసుకుంటే ముచ్చటగా మూడోసారి ప్రశాంత్ సినిమా మరోసారి షారుక్ సినిమాతో పోటీ పడుతుంది.

ఇలా ఈ సెంటిమెంట్ కనుక రిపీట్ అయితే తప్పనిసరిగా ప్రభాస్ సలార్ సక్సెస్ అవుతుందని కొందరు భావిస్తున్నారు.

మరి నిజంగానే ఈ పోటీలో ఎవరు సక్సెస్ అవుతారు లేదంటే విడుదల విషయంలో ఎవరైనా వెనకడుగు వేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

నెయ్యితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోండిలా!