ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతున్నారా..?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా.కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ దీనికి సంబందించేనా అంటూ హడావిడి చేస్తున్నారు.

కాంగ్రెస్ అధినేత సోనియా, రాహుల్ గాంధీ లతో ప్రశాంత్ కిశోర్ మీటింగ్ ప్రాముఖ్యత సంతరించుకుంది.

అయితే త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు, 2024 లో జరిగే సాధారణ ఎన్నికలపై వీరు చర్చించి ఉంటారని చెబుతున్నారు.

అయితే అదే కాకుండా ఇంకా ఏదో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర వహిస్తారని అనిపిస్తుంది.

ప్రశాంత్ కిశోర్ ఊహ్యకర్తగా ఉన్నాడు అంటే ఎన్నికల్లో విజయం సాధించినట్టే.ఈమధ్యనే పశ్చిమ బెంగాళ్ లో కూడా అది ప్రూవ్ అయ్యింది.

టీ.ఎం.

సీ కి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ చేశారు.ఆ పార్టీ ఘన విజయం సాధించడంలో ఆయన పాత్ర కీలకంగా మారింది.

అయితే బెంగాల్ ఎన్నికల తర్వాత తాను ఇకపై వ్యూహ కర్తగా పని చేయనని ప్రకటించారు.

రాజకీయాల్లోకి వస్తారా అని అడిగితే తనొక విఫల నేతనని చెప్పారు.గతంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూలో చేరారు ప్రశాంత్ కిశోర్.

అయితే ఆ తర్వాత పార్టీ నుండి బయటకు వచ్చారు.ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతారన్నట్టు ప్రచారం జరుగుతుంది.

సుకుమార్ కావాలనే రామ్ చరణ్ కోసం అలాంటి కథను రెడీ చేశాడా..?