ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్లు ఎంతో మీకు తెలుసా.. భారీగానే తీసుకుంటున్నారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మలకు( Prashanth Neel , Prashanth Varma ) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

ఈ ఇద్దరు డైరెక్టర్ల సక్సెస్ రేట్ కూడా చాలామంది దర్శకులతో పోల్చి చూస్తే ఎక్కువనే సంగతి తెలిసిందే.

ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 25 కోట్ల రూపాయలుగా ఉండగా ప్రశాంత్ వర్మ పారితోషికం 20 కోట్ల రూపాయలుగా ఉంది.

ఈ ఇద్దరు డైరెక్టర్లు తమ టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు.

అయితే ఈ ఇద్దరు డైరెక్టర్లు తాము చేస్తున్న చిన్న పనుల వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇతర డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు కథ అందించడం వల్ల వీళ్ల బ్రాండ్ వాల్యూ పోతోంది.

బఘీర సినిమాతో ప్రశాంత్ నీల్ కు షాకింగ్ ఫలితం ఎదురు కాగా దేవకీ నందన వాసుదేవ సినిమాతో( Movie Vasudeva ) ప్రశాంత్ వర్మకు షాకింగ్ రిజల్ట్ ఎదురైందనే సంగతి తెలిసిందే.

"""/" / ఈ ఇద్దరు డైరెక్టర్లు ఇకనైనా మారాలని మారని పక్షంలో ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తమ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడితే బాగుంటుందని ఈ ప్రాజెక్ట్స్ తేడా కొడితే ఈ డైరెక్టర్లకు భవిష్యత్తులో కొత్త మూవీ ఆఫర్లు వచ్చే విషయంలో సైతం ఇబ్బందులు ఎదురు కాక తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/" / గతంలో మారుతి సైతం పలు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

సౌత్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్లు డైరెక్షన్ పై ఫోకస్ పెడితే బాగుంటుందని ఇతర విషయాలపై ఫోకస్ పెడితే మాత్రం ఇబ్బందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్దరు డైరెక్టర్లు ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈ డైరెక్టర్లకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ ఇద్దరిలో మహేష్ బాబు కెరియర్ నిలబెడింది ఎవరంటే..?