సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
TeluguStop.com
ప్రభాస్( Prabhas ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ( Salaar ) విడుదలై సరిగ్గా ఏడాది అయింది.
గతేడాది ఇదే రోజున సలార్ విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేసింది.
ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
అయితే ప్రశాంత్ నీల్ తాజాగా సలార్ రిజల్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సలార్1 ఫలితం విషయంలో తాను పూర్తిస్థాయిలో సంతృప్తితో లేనని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు.
సలార్1 సక్సెస్ సాధించినా ఆ సినిమాలో కేజీఎఫ్2( KGF 2 ) సినిమా ఛాయలు కనిపించాయని ఆయన చెప్పుకొచ్చారు.
సలార్1 సినిమా కోసం నేను చాలా కష్టపడ్డానని ప్రశాంత్ నీల్ వెల్లడించారు.సలార్2( Salaar 2 ) సినిమాను మాత్రం కెరీర్ బెస్ట్ మూవీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు.
"""/" /
అభిమానులు, ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా సలార్2 ఉండబోతుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో( Jr NTR ) డ్రాగన్ సినిమాను తెరకెక్కించిన తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారని సమాచారం అందుతోంది.
ప్రశాంత్ నీల్ భవిష్యత్తు సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
"""/" /
ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.
ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
రెండేళ్లకు ఒక సినిమా తెరకెక్కించే విధంగా ప్రశాంత్ నీల్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ప్రశాంత్ నీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
షాకింగ్: బంగారు నాలుకలున్న 13 మమ్మీలు.. ఎందుకో తెలిస్తే మతి పోవాల్సిందే..