గుబులు పుట్టిస్తున్న పీకే సర్వేలు

నిజామాబాద్ జిల్లా పొలిటికల్ సర్కిల్ లో నేతలు ప్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నారు.వివిధ పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.

వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దపడుతున్నారు.జాతీయ స్థాయిలో బీజేపీకి వస్తున్న ప్రజాధరణతో కాషాయం కుండవా కప్పుకునేందుకు రెడీ అవతున్నారు.

దాంతో జిల్లాలో బీజేపీకి పాలోయింగ్ పెరుగుతోంది.బీజేపీలోకి అడుగు పెట్టేందుకు అందరికన్నా ముందుండాలనే ఆలోచనలో ఆయా పార్టీల ముఖ్య నేతలు అనుచరులతో తీవ్రంగా చర్చిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో లీడర్లు ప్యూచర్ ప్లాన్ వేసుకుంటున్నారు.దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కంగుతినటం.

బీజేపీ రోజు రోజుకూ బలపటం.ఇతర పార్టీల నాయకుల్లో కొత్త ఆలోచనలు రేకేత్తిస్తున్నాయి.

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ పై కొందరు నేతలు ఫ్యూచర్ పాలిటిక్స్ పై బ్రెయిన్ హీటెక్కిస్తున్నారు.

బీజేపీ పార్టీలో చేరేందుకు అనుంగులతో నిరంతరం చర్చిస్తున్నట్లు సమాచార.ఇప్పటికే గులాబీ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.

ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో అన్న భయం కొందరు నేతల్లో వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న9మంది ఎమ్మెల్యేల్లో 8 మంది టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచిన వారున్నారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేంధర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

"""/"/ మరోవైపు నిజామాబాద్ జిల్లాలో.పీకే సర్వేలు కలకలం రేపుతున్నాయ్.

జిల్లాలో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, మళ్లీ టికెట్ ఇస్తే వారు గెలుస్తారా లేదా అన్నదానిపై టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద రిపోర్ట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే అందులో ఎవరికి టికెట్ ఇస్తారు.ఎవరిని పక్కన పెడతారో అన్న ఆందోళనలో కొందరు నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంత మందికి టికెట్ వస్తుందో అన్నదానిపై ఆయా నాయకుల్లో ఒకింత ఆందోళనైతే ఉన్నట్లు తెలుస్తోంది.

పీకే సర్వేల్లో ఏ ఎమ్మెల్యేకు ప్లస్, ఏ ఎమ్మెల్యేకు మైనస్ అన్నది.ఆయా నేతల్లో గుబులు రేకిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరిపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయ్.

\ దేశంలో ప్రధాని నరేంధ్రమోడీకి రోజురోజుకు చరిష్మా పెరుగుతోంది.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధి స్పష్టమైందంటున్నారు పోలిటికల్ ఎనలిస్ట్ లు.

మరోవైపు ఇందూరు జిల్లావాసులు బీజేపీ నుంచి ఎంపీగా అరవింద్ ను గెలిపించారు.నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాషాయం పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయ్.

బీజేపీ చేయిస్తున్న సర్వేల్లో కూడా బీజేపీకి మంచి ఫలితాలు వస్తున్నట్లు సమాచారం.వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ స్పష్ఠమైన ప్రభావం చూపుతుందన్న నమ్మకం ఆ పార్టీ నాయకత్వంలో ధృఢంగా ఉంది.

జిల్లాలో పార్టీ పూర్వం కన్నా బలం పుంజుకుంది.అయితే ఇప్పుడున్న కొందరు ఎమ్మెల్యేల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకుంటే అలాగే అంతకుముందే బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో టచ్ లో కూడా ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.

కామారెడ్డి జిల్లాలో కూడా ఓ ఇద్దరు నేతలు కాషాయం పార్టీ మీద కన్నేస్తున్నట్లు తెలుస్తోంది.

కొందరు నేతలు ఇంటర్నల్ గా తాము గెలుస్తామా లేదా అన్న దానిపైనా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నానాటికి తగ్గుతున్న ఆధరణతో ఆ పార్టీలోనూ పలువురు నేతలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఓక్లారిటీకి వచ్చేపనిలో జిల్లా నేతలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.

‘హెలికాప్టర్ ‘ కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ?