చంద్రబాబుతో భేటీ పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో( Chandrababu Naidu ) భేటీ కావడం తెలిసింది.
వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.ఈ భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు సీనియర్ లీడర్ ఆయన కలవాలని చెప్పారు.అందుకే ఇక్కడికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిసినట్లు పీకే స్పష్టం చేశారు.
దాదాపు వీరిద్దరి భేటీ మూడు గంటలు పాటు జరిగింది.గత మూడు నెలల నుండి ప్రశాంత్ కిషోర్ తో తెలుగుదేశం పార్టీ టచ్ లో ఉండటం జరిగింది.
గతంలో రెండు సార్లు లోకేష్.( Nara Lokesh ) ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడం జరిగింది.
"""/" /
కాగా నేడు చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై.
చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.అంతేకాదు వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ( TDP ) నిర్వహించే క్యాంపెయిన్ ప్రశాంత్ కిషోర్.
కనుసన్నల్లో జరగనున్నట్లు సమాచారం.అంతేకాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ సర్వే చేసి.
ఆ వివరాలను చంద్రబాబుకి వివరించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.ఇదిలా ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ప్రజలలోకి ఎక్కువగా తీసుకెళ్లే విధంగా.
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలు టీడీపీ తరఫున సిద్ధం చేస్తున్నట్లు టాక్.
శంకర్ సినిమాలకు గుడ్ బై చెబితే బెటర్.. ఆ రేంజ్ లో ఎవరూ ఖర్చు చేయరంటూ?