ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టేస్తున్నారా ?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంది.

దీనికి తగ్గట్లుగానే ఆయన వ్యవహారాలు చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది.మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే హడావుడి నడిచింది.

దీనికి తగ్గట్లుగానే రెండు మూడు రోజులపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తో ప్రశాంత్ కిషోర్ కీలక సమావేశాలు నిర్వహించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలనే విషయంపై వారందరికీ క్లారిటీ ఇచ్చారు.

కానీ చివరి నిమిషంలో తాను కాంగ్రెస్ లో చేరడం లేదు అంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్నారు.

కొన్ని చోట్ల నేరుగా పని చేస్తుండగా మరికొన్ని చోట్ల ఆయనకు చెందిన ' ఐ ప్యాక్ ' సంస్థ ద్వారా రాజకీయ వ్యూహాలను అందిస్తున్నారు.

ఇక ఆయన కాంగ్రెస్ లో చేరక పోవడానికి ప్రధాన కారణం ఇదేనని తెలుస్తోంది.

కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న చాలా ప్రాంతీయ పార్టీలతో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఒప్పందం చేసుకోవడంతో ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలకు రాజకీయ వ్యూహాలు అందించడం సరికాదనే ఉద్దేశం తో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ కు కండిషన్లు పెట్టడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు.

ఇప్పటికే అనేక పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.  """/"/ 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.

ఆ సమయంలోనే ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .2017లో అమరేందర్ సింగ్ కోసం కాంగ్రెస్ తరఫున పని చేశారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ విజయానికి ప్రశాంత్ కిషోర్ కారణమయ్యారు.2019 ఎన్నికలకు ముందు నుంచి ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహాలను అందించారు.

2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలను గెలిచేలా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందించారు.

ఇక పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు.ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రశాంత్ కిషోర్ చాలా పార్టీలను అధికారంలోకి తీసుకు వచ్చేల చేయగలిగారు.

  ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో చేరితే అనవసర ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే సొంత పార్టీ పెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు భారత ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈరోజు కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నా కొడుకు చావుకు వాళ్లే కారణం… ఎమోషనల్ అయినా గీతూ రాయల్?