జగన్ జన నేత కాదు : ప్రశాంత్ కిశోర్
TeluguStop.com
ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore ) మరోసారి ఏపీ రాజకీయాలపై స్పందించారు.
ముఖ్యంగా వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా తన సంస్థ ఐ పాక్ ద్వారా రాజకీయ వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ జగన్( Jagan ) కు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందారు.
అప్పట్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, స్లొగన్స్, సర్వేలు ఇలా అన్ని విషయాల్లోనూ ప్రశాంత్ కిషోర్ టీమ్ చూసుకుంది.
అప్పటి ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంలోనూ ప్రశాంత్ కిషోర్ కీలకపాత్ర పోషించారు.
అయితే ఇటీవల ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
"""/" /
అనేక అంశాలపై చర్చించారు అలాగే ఏపీకి వచ్చి చంద్రబాబు( Chandrababu ) నివాసానికి ప్రశాంత్ కిషోర్ వెళ్లడం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
తాజాగా మరోసారి జగన్ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటమి తప్పదని , జగన్ జననేత కాదని, ఆయన జనం నుంచి రాలేదని, తనకు తానుగా తయారు చేసుకున్న నాయకుడు మాత్రమేనని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.
పి టి ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా అనేక సంచలన విమర్శలు చేశారు .
ఏపీలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, కేవలం డబ్బులు పంచడానికి జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, దీని కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటిపడిపోయిందని , దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.
ఏపీ ఏ విషయంలోనూ అభివృద్ధి చెందకపోవడం పైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కేవలం డబ్బులు జనాలకు పంచడమే అభివృద్ధిగా జగన్ చూస్తున్నారని, దీని కారణంగానే ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.
"""/" /
జనాల అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకోకుండా ముందుకు వెళితే పరాభవం తప్పదని ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు.
జగన్ పైన, వైసిపి పైన తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా వ్యాఖ్య లు చేస్తున్నారని మండిపడుతున్నారు.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!