మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హిట్ ఇవ్వగలడా.. ఆ ఫ్లాప్ చూసి టెన్షన్ మొదలైందిగా!

టాలీవుడ్ హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

నందమూరి అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ(prasanth Varma Mokshagna ) చేతుల మీదుగా తెరంగేట్రం అవ్వడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ విషయాలను ప్రశాంత్ వర్మ(prasanth Varma ) వెల్లడించడంతో పాటు మోక్షజ్ఞ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజాగా యాక్షన్ కోసం సిద్ధంగా ఉన్నారా? సింబా వస్తున్నాడు అంటూ లేటెస్టుగా మోక్షజ్ఞ స్టైలిష్ లుక్ కి సంబంధించిన ఫోటోని దర్శకుడు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు నందమూరి అభిమానులను ఒక విషయం ఎక్కువగా భయపడుతోంది.

"""/" / అదేమిటంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కించిన హనుమాన్(Hanuman) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన విషయం తెలిసిందే.

దీంతో PVCUలో మరికొన్ని చిత్రాలను ప్లాన్ చేసుకున్నారు.మరోవైపు ఆల్రెడీ తాను రాసుకున్న కథలను ఇతర దర్శకులకు అందిస్తూ వస్తున్నారు.

ఇందులో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమాకి స్టోరీ అందించారు.

అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిరాశ పరిచింది.సినిమాని డైరెక్ట్ చేయనప్పటికీ, దగ్గరుండి ప్రమోట్ చేశాడు ప్రశాంత్ వర్మ.

ఈవెంట్స్ లో పాల్గొనడమే కాకుండా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లకు కూడా హాజరయ్యారు. """/" / హనుమాన్ తర్వాత ఆయన బ్రాండింగ్ తో వస్తున్న సినిమా కావడం, దూకుడుగా ప్రమోషన్స్ చేయడంతో జనాల్లో ఆసక్తి ఏర్పడింది.

కానీ సినిమా చూశాక ఆడియన్స్ చాలా షాక్ అయ్యారు.ఇలాంటి కథ గురించేనా ప్రశాంత్ అంతలా చెప్పింది అనే కామెంట్లు కూడా వినిపించాయి.

భాగవతం రెఫరెన్స్ తీసుకుని కృష్ణుడు, కంసుడు, సత్యభామ పాత్రల స్ఫూర్తితో దేవకీ నందన వాసుదేవ కథ రాసినట్లుగా తెలుస్తోంది.

ఇది ఈ జనరేషన్ ఆడియన్స్ కు ఏమాత్రం కనెక్ట్ అవ్వని అవుట్ డేటెడ్ స్టోరీ.

పరమ రొటీన్ స్క్రీన్ ప్లేతో నడిపించారు.ఒక్క ట్విస్ట్ తప్పితే సినిమాలో చెప్పుకోడానికి ఏమీ లేదు.

అందుకే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు.దీంతో తొలిసారిగా ప్రశాంత్ వర్మకు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.

ఇప్పుడు అసలు విషయానికొస్తే, ప్రశాంత్ వర్మ రాసిన దేవకీ నందన వాసుదేవ మూవీ ఫ్లాప్ అవడంతో.

ఆ ఎఫెక్ట్ బాలకృష్ణ వారసుడి సినిమా మీద పడుతుందేమో అని నందమూరి ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.

మోక్షజ్ఞ కోసం దర్శకుడు ఎలాంటి కథను సిద్ధం చేశారో అని ఆలోచిస్తున్నారు.

ట్రంప్‌కు ఫస్ట్ షాక్ .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన కోర్ట్, భారతీయులకు ఊరట