హనుమాన్ లాంచ్ చేసిన ప్రశాంత్ వర్మ

డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఇప్పటి వరకు మూడే సినిమాలు చేసినా కూడా వేటికవే ప్రత్యేకంగా ఉండే విధంగా అతని ఫిలిం కెరియర్ కొనసాగించారు.

రీసెంట్ గా జాంబీరెడ్డి మూవీతో కమర్షియల్ కూడా ప్రశాంత్ వర్మ సక్సెస్ అందుకున్నాడు.

అయితే దీనికి సీక్వెల్ గా నెక్స్ట్ సినిమా చేస్తాడని అందరూ భావించారు.అయితే దానికి విరుద్ధంగా సూపర్ మెన్ కథాంశంతో సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ రెడీ అయ్యి నెల రోజుల క్రితమే పోస్టర్ కూడా లాంచ్ చేశారు.

భారీ బడ్జెట్ తో మొట్టమొదటి వరల్డ్ సూపర్ హీరోఅనే ట్యాగ్ లైన్ హనుమాన్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవం జరిగింది.ఇదిలా ఉంటే జాంబీ రెడ్డిలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జానే ఈ మూవీలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.

త్వరలో మిగిలిన క్యాస్టింగ్ కూడా ఖరారు చేస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ కన్ఫర్మ్ చేశారు.

ఇదిలా ఉంటే సినిమాలో ఇతర తారాగణం ఎవరనేది త్వరలో తెలియజేస్తామని స్పష్టం చేశారు.

"""/"/ అలాగే జులై ఆఖరు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఇది జాంబీ రెడ్డికి సీక్వెల్ అనే మాట కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.

సైన్స్ కి సూపర్ పవర్ ని లింక్ చేస్తూ హనుమాన్ మూవీలో కథనాన్ని ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?