సారీ ఇప్పుడేం చేయలేం ! టీడీపీకి పీకే క్లారిటీ  ? 

గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో ప్రముఖ రాజకీయ వ్యవహకర్త ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) పేరు మారుమోగుతూనే ఉంది.

తెలుగుదేశం పార్టీకి( TDP ) ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, ఆయన వ్యూహాలతోనే ముందుకు వెళ్ళబోతున్నామని గెలుపు తమ ఖాతాలో పడబోతుందంటూ టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా జనాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ( YCP ) గెలుపునకు కారణమైన ప్రశాంత్ కిషోర్ అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించడం ఏమిటి ? అసలు ఇందులో వాస్తవం ఏమిటి అనేది జనాల్లో ఆసక్తి పెరిగింది.

  ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ కావడం , ఢిల్లీలోనే లోకేష్ ఎక్కువ రోజులు మకాం వేయడంతో , ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో చర్చలు జరిపారని , చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత  ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకారం తెలిపారు అనే హడావుడి జరిగింది.

"""/" / అయితే దీనికి సంబంధించిన మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించే బాధ్యతలు తీసుకోవాల్సిందిగా టిడిపినే ప్రశాంత్ కిషోర్ కోరిందని,  ప్రస్తుతం టిడిపికి రాజకీయ వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శర్మ( Robin Sharma ) వ్యూహాలు బాగానే పనిచేస్తున్నా , వైసీపీని( YCP ) ఎదుర్కోవాలంటే ఆ వ్యూహాలు సరిపోవని అందుకే ప్రశాంత్ కిషోర్ తో  భేటీ అయ్యి ఒప్పించే ప్రయత్నం చేశారనే విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది.

"""/" / ఈ ప్రతిపాదనకు ప్రశాంత్ కిషోర్ ఒప్పుకుంటే ఆయనకు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమేననే ప్రతిపాదన టిడిపి చేసినా,  ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని ఓడించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైసీపీ ప్రజల్లో ఉంటోందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేసిన గెలుపు కష్టమనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ టిడిపికి తేల్చి చెప్పినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలిమట్టికి ఉన్న విలువ ఇదే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?