ఈ ఆలయంలో ప్రసాదం స్వయంగా దేవుడే భుజిస్తాడు.. ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

ఈ ఆలయంలో ప్రసాదం స్వయంగా దేవుడే భుజిస్తాడు ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి నైవేద్యం సమర్పించి మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు పెడతాము.

ఈ ఆలయంలో ప్రసాదం స్వయంగా దేవుడే భుజిస్తాడు ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా?

అయితే మనం పెట్టిన నైవేద్యం స్వామివారు భుజించడం మనం ఎక్కడ చూడలేదు.కాని కేరళలోని తిరువరపు శ్రీకృష్ణ దేవాలయంలో స్వామి వారు భక్తులు పెట్టే నైవేద్యం స్వయంగా తింటారు అని చెప్పవచ్చు.

ఈ ఆలయంలో ప్రసాదం స్వయంగా దేవుడే భుజిస్తాడు ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా?

అదేవిధంగా అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత దీపారాధన చేసే ఏకైక దేవాలయం కూడా ఇదే.

ఈ ఆలయంలో ఉన్న శ్రీ కృష్ణడు ఎంతో ఆకలిగా ఉంటారు.అందుకోసమే ఈ ఆలయంలో స్వామి వారికి ప్రతిరోజు ఏడు సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు.

ఈ విధంగా నైవేద్యం సమర్పించిన ప్రతిసారీ కొంత పరిమాణం తగ్గుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఈ విధంగా ప్రసాదం తగ్గిపోవడంతో స్వామివారే నైవేద్యం తింటారని భక్తులు విశ్వసిస్తారు.మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే భక్తులు చూస్తుండగానే స్వామి వారికి పెట్టిన నైవేద్యం తగ్గిపోతుంది.

సాధారణంగా మన దేవాలయాలలో ఉదయం స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేసి నైవేద్యం సమర్పిస్తాము.

కానీ ఈ ఆలయంలో మాత్రం ముందుగా స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అభిషేకం నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆలయ ద్వారాన్ని తెరవాలి.

లేకపోతే పెద్ద అరిష్టం జరుగుతుందని భావిస్తారు.గ్రహణ సమయాలలో దేశంలో ఉన్న వివిధ ఆలయాలు మూతపడతాయి.

కానీ గ్రహణం ఉన్న సమయంలో ఈ ఆలయం మూత పడదు.నిత్య పూజలతో ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

పూర్వం ఒక రోజు గ్రహణ సమయంలో ఆలయం మూసివేయడం వల్ల పెద్ద అరిష్టం జరగడం వల్ల అప్పటి నుంచి గ్రహణ సమయంలో ఆలయం తెరిచే ఉంచుతారు.

మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న స్వామివారు ఎంతో ఆకలితో ఉంటారు.

నైవేద్యం సమర్పించడం కొంత ఆలస్యమైతే స్వామివారి నడుముకు చుట్టిన ఆభరణం వదులుగా మారి కిందకి జారడం మనం చూడవచ్చు.

అదే విధంగా జాతకంలో ఏమైనా దోషాలున్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని పూజించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.