వీడియో: ఇదేం ప్రాంక్‌రా అయ్యా.. గుండె ఆగేలా చేశావు..
TeluguStop.com
ఈ రోజుల్లో ప్రాంక్స్ అంటూ జనాలకు హడలు పుట్టిస్తున్నారు కొందరు ఆకతాయిలు.వ్యూస్ కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారు వీరు.
రోడ్డుపై వెళ్తుంటే వాటర్ బాల్స్ విసరడం, కొట్టి పారిపోవడం, ముద్దు పెట్టుకుని పరిగెత్తడం, బెలూన్స్ పేల్చుతూ భయపెట్టడం, బొమ్మ పాములను మీద విసరడం లాంటి పిచ్చి పనులు ఎన్నో చేస్తున్నారు.
ప్రజలకు ఈ పిచ్చి పనుల వల్ల గుండాగినంత పని అవుతోంది.కాగా తాజాగా ఒక ప్రాంక్‌స్టర్ హాయిగా పడుకున్న ఒక అమాయకుడిని దెయ్యం వేషంతో చాలా భయపెట్టాడు.
నిద్ర మత్తులో నుంచి లేవగానే.వికృత రూపం చూసి ఆ వ్యక్తి గట్టిగటిగా అరిచేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మంచిగా నిద్రపోయే వాడిని లేపి ఇలా భయపెట్టడం ఏం బాగోలేదని నెటిజన్లు ఆ ప్రాంక్‌స్టర్‌ను తిట్టిపోస్తున్నారు.
వైరల్ వీడియోలో ఒక ప్రాంక్‌స్టర్ దెయ్యం ముసుగు ధరించి ఉండటం మీరు చూడవచ్చు.
ఆ తర్వాత ఆ ప్రాంక్‌స్టర్ రిక్షాలో పడుకున్న ఒక వ్యక్తి దుప్పటి పట్టుకొని లాగడం గమనించవచ్చు.
అయితే ఈ బెడ్ షీట్ ఎవరు లాగుతున్నారా అని అతడు వెంటనే లేచాడు.
అప్పుడు కళ్ళ ముందు ఒక వికృత రూపం కనిపించడంతో ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయింది.
వెంటనే అతడు గట్టిగా అరిచేస్తూ పారిపోవడానికి ప్రయత్నించాడు.చివర్లో కింద కూడా పడినట్లు కనిపించింది.
"""/"/
ఈ వీడియోను @planet_visit అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.
దీనికి ఇప్పటికే వేలల్లో, వ్యూస్ లైక్స్ వచ్చాయి.ఈ ప్రాంక్ వీడియోను మీరు కూడా చూసేయండి.