ఆ డాక్టర్ ఆత్మహత్య.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ ప్రణీత సుభాష్!

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత గురించి తెలిసిందే.మొదట ఏం పిల్లో ఏం పిల్ల‌డో సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో త‌న లుక్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంది.

ఆ త‌రువాత ఆమెకు వ‌రుస అవ‌కాశాలతో తెలుగు, త‌మిళం, క‌న్న‌డలో వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయింది ప్ర‌ణీత‌.

ఇది ఇలా ఉంటే తాజాగా రాజస్థాన్ లో ఒక మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదే విషయంపై తాజాగా ప్రణీత సుభాష్ స్పందించింది.అసలు విషయంలోకి వెళితే.

రాజస్థాన్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అర్చన శర్మ అనే ఒక గైనకాలజిస్ట్ పని చేస్తోంది.

అయితే ఒకరోజు హాస్పిటల్లో ఒక గర్భిణీకి ఆమె వైద్యం చేస్తున్న సమయంలో ఆ గర్భిణీ అకస్మాత్తుగా కన్నుమూసింది.

దీంతో సదరు గర్భిణీ కుటుంబ సభ్యులు అర్చన శర్మ పై కేసు నమోదు చేశారు.

అంతేకాకుండా అర్చన శర్మ సినిమా వల్లనే గర్భిణీ చనిపోయింది అని హాస్పిటల్ వద్ద వివాదాన్ని సృష్టించారు.

దీనితో అర్చన శర్మకు ఇబ్బందిగా, అవమానంగా ఫీల్ అవ్వడం తో దయచేసి అమాయకులైన డాక్టర్స్ ను వేదించ వద్దు.

నేను ఎటువంటి తప్పు చేయలేదు. """/"/ ఎవరి చావుకు నేను కారణం కాదు.

కనీసం నా చావుతో నైనా నేను తప్పు చేయలేదు అని గుర్తించండి అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది అర్చన శర్మ.

ఆమె చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా జస్టిస్ ఫర్ డాక్టర్ అర్చన శర్మ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇదే విషయంపై ప్రణీతా సుభాష్ అర్చన శర్మ కు మద్దతుగా లేఖను రాసి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం ఎంత బాధాకరం.ప్రతిసారి డాక్టర్స్ నిందిస్తూ ఉంటాం తప్పులు పడుతూ ఉంటాం.

ఇతరుల ప్రాణాలను కాపాడే మరో వంద మంది వైద్యులు ఇలాంటి చర్యల వల్ల రిస్క్ తీసుకోవడం ఆపేస్తారు.

మిమ్మల్ని ప్రేమించే వారు మీరు చేసిన పనికి మూల్యం చెల్లించుకోవాలి.కానీ అది మీకు తెలియకపోవచ్చు అంటూ ప్రణీత ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.