అమృత గో బ్యాక్ అంటూ గట్టిగా నినాదాలు చేయడంతో ఆమె అక్కడినుండి వెనుదిరిగారు.
తన తండ్రి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి మరేదైనా కారణం ఉండవచ్చని ఆమె తెలిపారు.
అమృత కళ్లు తిరిగి పడిపోవడంతో ఆమెను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.డాక్టర్లు అమృత ఒత్తిడికి లోనై కళ్లు తిరిగి పడిపోయిందని చికిత్స అనంతరం బాగానే ఉన్నారని చెబుతున్నారు.
అమృత మీడియాతో మాట్లాడే సమయంలో తన బాబాయ్ శ్రవణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
శ్రవణ్ రెచ్చగొట్టినందువల్లే తన తండ్రి తప్పు చేశాడని అనుకుంటున్నానని చెప్పింది.ఆస్తుల గురించి వార్తలు వస్తున్నాయని తన పేరుపై ఎలాంటి ఆస్తులు లేవని అమృత అన్నారు.
తన తల్లి దగ్గరికి వెళ్లి ఉండటం సాధ్యం కాదని తన తల్లి తనతో ఉంటానంటే మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
అక్కినేని ఫ్యామిలీ మూల స్తంభాన్ని కోల్పోయింది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్!