రామ జన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం

అయోధ్యలోని రామ జన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.కాగా ఈ కార్యక్రమం ‘మంగళ ధ్వని’ ( Mangal Dhvani )తో మొదలు కానుంది.

దాదాపు రెండు గంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికి పైగా కళాకారుల సంగీత వాయిద్యాలతో శ్రీరామునికి నీరాజనం ఇవ్వనున్నారు.

"""/" / కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో సంగీత ప్రదర్శన ఉండనుండగా వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఉండనుంది.

యూపీ నుచి పఖావాబ్, బాన్సూర్, డోలక్ తో పాటు ఒడిశా నుంచి మర్ధల్, కర్ణాటక నుంచి వీణ, మధ్యప్రదేశ్ నుంచి సంతూర్, ఏపీ నుంచి ఘటం, జార్ఖండ్ నుంచి సితార్, తమిళనాడు నుంచి నాదస్వరం, తవిల్, మృదంగం సంగీత వాయిద్యాలతో నీరాజనం అందించనున్నారు.

సివిల్స్ సాధించి సేవాభావంతో వేలమంది ఆకలి తీరుస్తున్న ధాత్రి రెడ్డి.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!