మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ​ఎన్నికలు రద్దు.. ప్రకాష్ రాజ్ ప్లాన్ ఇదేనా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకాష్ రాజ్, అతని ప్యానల్ సభ్యులు విష్ణుకు వరుసగా షాకులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హోరోహోరీగా జరగగా విష్ణు 107 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఎన్నికల ఫలితాలు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను తీవ్రంగా నిరాశపరిచాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే నాగబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అనంతరం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులతో రాజీనామాలు చేయించి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

ఆ తర్వాత ప్రకాష్ రాజ్ సీసీ టీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారిని కోరిన సంగతి తెలిసిందే.

ప్రకాష్ రాజ్ కోర్టుకు వెళ్లాలనే ఆలోచనతో సీసీ టీవీ ఫుటేజీ అడిగారని తెలుస్తోంది.

అయితే ప్రకాష్ రాజ్ కోర్టుకు వెళ్లడం ద్వారా ఎన్నికలు రద్దు చేయించే ఛాన్స్ కూడా ఉందని సమాచారం.

ఎన్నికల అధికారి సైతం ప్రకాష్ రాజ్ కు సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వడానికి అంగీకరించడంతో విష్ణుకు ఇబ్బందులు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/"/ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రద్దు అయితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

మరోవైపు మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

900 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల, ఎన్నికల ఫలితాల విషయంలో ఊహించని స్థాయిలో వివాదాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.

"""/"/ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి చల్లారకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.

కేజ్రీవాల్ అరెస్ట్ అంశంపై సుప్రీంకోర్టులో ప్రస్తావన..!