మహేష్ సినిమా పాత్ర నచ్చక పోయినా చేశానన్న ప్రకాశ్ రాజ్..!

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఎలాంటి పాత్ర చేసినా సరే ఆ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు.

అయితే కొన్నిసార్లు తన నటని టెస్ట్ చేసేలా కొన్ని పాత్రలు వస్తుంటాయి.ఇన్నేళ్ల అనుభవంలో ఆయన చేయని పాత్ర లేదని చెప్పొచ్చు.

ఇక ఇదిలాఉంటే కొన్ని సినిమాల్లో పాత్రలు నచ్చకపోయినా సరే చేస్తుంటారట.ఇదే విషయాన్ని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రకాశ్ రాజ్.

తనకు పాత్ర నచ్చకపోయినా సరే మోహమాటానికో.లేక డబ్బులకో కొన్ని సినిమాలు చేశానని అన్నారు.

అలాంటి వాటిలో మహేష్ తో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఒకటని అన్నారు ప్రకాశ్ రాజ్.

నటుడిగా తను ఎంచుకున్న పాత్రలో ఎలా నటించాలి అన్న ఆసక్తి కలగాలని.రొటీన్ పాత్రలు చేసి తనకు బోర్ కొట్టేసిందని అన్నారు.

మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో తను చేసిన పాత్ర తనకు నచ్చకపోయినా అలా చేయాల్సి వచ్చిందని అన్నారు ప్రకాశ్ రాజ్.

అంతేకాదు కొన్నిసార్లు అలా నచ్చకపోయినా సరే సినిమాల్లో నటించాల్సి వస్తుందని అన్నారు.మనసుకు నచ్చిన పాత్రలకు రెమ్యునరేషన్ తక్కువ తీసుకుని అయినా తాను చేస్తానని.

అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కోసం తాను కొంత వర్క్ కూడా చేస్తానని అన్నారు.

"""/" / అయితే కమర్షియల్ ఇంకా రొటీన్ పాత్రలకు అయితే రెమ్యునరేషన్ తగ్గించనని అన్నారు.

ఇక ఈమధ్య కాలంలో చేసిన మేజర్ సినిమా తనకు బాగా నచ్చిందని.అలాంటి పాత్రలు చేస్తున్నప్పుడు మనసు చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు ప్రకాశ్ రాజ్.

అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో తను చేసిన పాత్ర నచ్చలేదని చెప్పేసరికి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

నచ్చకపోతే చేయకుండా ఉండాల్సింది కానీ చేసి రెమ్యునరేషన్ తీసుకుని ఇప్పుడు సినిమా నచ్చలేదని చెప్పడం ఏంటని మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ వీడియో: బిగ్ బాస్ హౌజ్ లో పాము కలకలం..