'మా' సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్!

మా అధ్యక్షా ఎన్నికలు నిన్న హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే.ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ను ఓడించి గెలిచారు.

గత 20 రోజులుగా ఈ ఎన్నికల కోసం అటు ప్రకాష్ రాజ్ వర్గం.

ఇటు మంచు విష్ణు వర్గం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ ఎన్నికలను రసవత్తరంగా మార్చారు.

ఎవ్వరు తగ్గకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒకరిపై ఒకరు దూషించు కున్నారు.

"""/"/ మా ఎన్నికల్లో ఎప్పుడు లేనంత రసవత్తరంగా ఈసారి ఎన్నికలు జరగడంతో చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

అయితే విష్ణు గెలుపొంది మా అధ్యక్ష పదవిని అధిష్టించ బోతున్నారు.ఇక ఓడిపోయినా ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు.

మా సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్ళే అధ్యక్షుడు కావాలని ఎన్నుకున్నారని వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపాడు.

కానీ తనకు ఆత్మగౌరవం ఉందని ఇకపై మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండనని ఇది నొప్పితో తీసుకున్న నిర్ణయం కాదని ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

ఈ నిర్ణయాన్ని కొత్తగా అధ్యక్షుడైన మంచు విష్ణు కు మెసెజ్ చేసి తెలిపాడు.

తన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయాలనీ ప్రకాష్ రాజ్ కోరుతున్నాడు.భవిష్యత్తులో కూడా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తానని ఆయన తెలిపాడు.

"""/"/ నిన్న మా ఎన్నికల్లో ఓడిపోయినా ప్రకాష్ రాజ్ రాజినామా చేస్తున్నట్టు ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు.

ప్రెస్ మీట్ పెట్టి మరి తన రాజీనామా విషయాన్ని తెలిపాడు.ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు కు ఆల్ ది బెస్ట్ కూడా తెలిపాడు.

మరి చూడాలి మంచు విష్ణు ప్రకాష్ రాజ్ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో.

రాజినామా ఆమోదిస్తాడో లేదో తెలియాల్సి ఉంది.

దళితులపై నారా భువనేశ్వరి అసభ్య పదజాలం.. ఫేక్ కాదని నిర్ధారణ..!!