కంగనా ను ఎద్దేవా చేసిన ప్రకాష్ రాజ్!

గత కొంతకాలంగా ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న కంగనా రనౌత్ కు సంబంధించిన ఓ భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చింది.

దీనిపై స్పందించిన కంగనా ఇలాంటి బెదిరింపు చర్యలు తనని భయపెట్టవని తాను న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానని ట్వీట్ చేసింది.

గతంలో తెరమీద లక్ష్మీబాయిగా నటించి మెప్పించిన కంగనా ప్రస్తుతం రియల్ లైఫ్ లో కూడా తన తెగువను చూపుతూ మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతుందని కొందరు అభిమానులు ఆమెను ప్రశంసించారు.

దీనిపై స్పందించిన కంగనా " రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, త్యాగాలను సినిమా ద్వారా చూపించిన నేను.

నిజజీవితంలోనూ తల వంచనంటూ ట్వీట్ చేసింది.దీనిపై స్పందించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక్క సినిమాతో కంగనా రనౌత్ తనని తాను రాణి లక్ష్మీబాయితో పోల్చుకుంటే మరి అక్బర్ గా నటించిన హృతిక్ రోషన్,మంగళ్ పాండేగా నటించిన ఆమీర్ ఖాన్, మోడీ గా నటించిన వివేక్,పద్మావతిగా నటించిన దీపికా పదుకుణె,భగత్ సింగ్ గా నటించిన అజయ్ ను ఆ గొప్పవారితో పోల్చవచ్చా అని ప్రకాశ్ రాజ్ కంగనా ను ప్రశ్నించారు.

బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు…. బాలయ్య పై ప్రశంసలు కురిపించిన ఊర్వశి!