జిమ్ లో చిరుతో ప్రత్యక్షమైన ప్రకాష్ రాజ్..పిక్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ మా ఎన్నికలు రసవత్తరంగా మరీనా విషయం తెలిసిందే.
ఇంతకు ముందు ఏకగ్రీవముగా ఎన్నుకునే వారు.కానీ గత ఎన్నికల నుండి పోటీ మొదలయ్యింది.
ఈసారి అయితే అది ఇంకా ఎక్కువ అయ్యింది.ఇప్పటికే చాలా మంది నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ పడుతూ వాదనలకు దిగుతూ దూషించుకుంటూ ఉన్నారు.
ఈ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ కూడా పోటీ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు.ముందుగా ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య పోటీ ఉండగా ఆ తర్వాత రేస్ లోకి మరికొంత మంది వచ్చారు.
అయితే ముందు నుండి కూడా ప్రకాష్ రాజ్ మెగా కుటుంబ అండతో తన ప్యానెల్ ను బలంగా మార్చుకుంటూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.
అంతేకాదు చిరు కూడా ప్రకాష్ రాజ్ కె సపోర్ట్ అంటూ గుసగుసలు వినిపించాయి.
ఆ తర్వాత నాగబాబు స్వయంగా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ప్రకటించడంతో ఇక ప్రకాష్ రాజ్ గెలుపు ఖరారు అన్నట్టు సాగింది.
అయితే కొద్దీ రోజుల క్రితం ప్రకాష్ రాజ్ షూటింగ్ లో గాయపడడంతో శస్త్ర చికిత్స తర్వాత వైరం తీసుకుంటున్నాడు.
అయితే మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు తనకు సపోర్ట్ చేస్తున్న సభ్యులతో కలిసి జెండా ఎగుర వేసి అందరిని ఆశ్చర్య పరిచారు.
అయితే తాజాగా మెగాస్టార్ తో కలిసి జిమ్ లో ప్రత్యక్షం అయ్యి మరొకసారి ప్రేక్షకులను షాక్ కు గురి చేసారు.
"""/"/
పొద్దు పొద్దునే మెగాస్టార్ చిరు తో కలిసి జిమ్ లో ప్రత్యక్షం అయ్యిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన స్పందన తెలియపడు.
ఈ రోజు బాస్ ను జిమ్ లో కలిసాను.ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు పరిష్కారం కోసం ఆయన ముందుకు రావడం సంతోషంగా ఉందని మీరెపుడు మాకు స్ఫూర్తి అన్నయ్య అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసాడు.
ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విమానంలో చెలరేగిన మంటలు.. 294 మంది ప్రాణాలు చివరకి?!