సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిని పరిష్కరించాలని వివరించారు.దరఖాస్తుల పరిష్కారంలో జ్యాపం వద్దని స్పష్టం చేశారు.

ఆయా శాఖలకు రెవెన్యూ శాఖకు 27, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 4, ఉపాధి కల్పన శాఖకు 3, ఎస్సీ కార్పొరేషన్, వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖకు రెండు చొప్పున, ఎంపీడీఓ తంగళ్లపల్లి, ఎల్లారెడ్డి పేట, సర్వే, అటవీ శాఖ, ఎల్ డీ ఎం, మున్సిపల్ సిరిసిల్ల, ఎక్సైజ్ శాఖ, డీ సీ ఎస్ ఓ, డీ ఎస్ సీ డీఓ, సెస్ శాఖలకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి.

ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో రమేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Amerio Erfahrungen Und Reputation: Eine Analytische Einordnung