సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 110 దరఖాస్తుల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల:సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

జిల్లా సమీకృత కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.ప్రజావాణి లో వచ్చే దరఖాస్తులను నిర్ణిత గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఆయా శాఖలకు కలిపి మొత్తం 110 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ 50 శాఖకు, ఎంపీడీవో తంగళ్ళపల్లి 3, ఇల్లంతకుంట 2, వేములవాడ 2, వేములవాడ రూరల్ 1, ముస్తాబాద్ 4, రుద్రంగి 1, చందుర్తి 1, కోనరావుపేట 2, బోయిన్పల్లి ఎంపీడీవో కార్యాలయానికి 1, జిల్లా పౌర సరఫరాల అధికారి 4, జిల్లా వైద్యాధికారి 2, ఆర్ అండ్ బీ 2, ఎస్ డీ సీ, ఉపాధి కల్పన శాఖకు 8, మున్సిపల్ సిరిసిల్ల 2, డీపీ ఆర్ఈ, ఎక్సైజ్, నీటి పారుదల శాఖ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, డీఆర్డీఓ, జిల్లా పశివైద్యాధికారి ఒకటి చొప్పున, విద్యాశాఖకు 2, గనుల శాఖ 1,సెస్ 2, జడ్పీ సీఈవో 1, డీబీసీడీఓ 1 వచ్చాయి.

ఇక్కడ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

జగన్ అరెస్ట్ కు షర్మిల డిమాండ్ .. వైసీపీ కౌంటర్ ఇదే