పవన్ కళ్యాణ్ కు నా స్పెషల్ రిక్వెస్ట్ : కేఏ పాల్ 

త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) సైతం దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.

మొన్నటివరకు తెలంగాణలో హడావుడిచేసిన కేఏ పాల్ బీఆర్ఎస్ , కాంగ్రెస్,  బిజెపిలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు .

అయితే రాజకీయంగా కేఏ పాల్ చేసే విమర్శలను ఏ పార్టీ అంత సీరియస్ గా అయితే పట్టించుకోవడం లేదు.

అక్కడ ఎన్నికల తంతు ముగియడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలపై( AP Politics ) ఆయన పూర్తిగా దృష్టి సారించారు.

గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలపై పదేపదే పాల్ స్పందిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ( Praja Shanti Party ) తరఫున అభ్యర్థులను పోటీకి దింపే ఆలోచనతో ఉంటూనే తమ పార్టీలో చేరాల్సిందిగా పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) రిక్వెస్ట్ చేస్తూనే.

సీఎం పదవిని కూడా ఆఫర్ చేస్తున్నారు.టీడీపీ తో పొత్తు రద్దు చేసుకుని  తమ పార్టీతో కలిస్తే ముఖ్యమంత్రి చేస్తాను అంటూ  పవన్ కళ్యాణ్ కు ఆఫర్లు ఇస్తున్నారు.

"""/" / తాజాగా ఏపీ పర్యటనలో ఉన్న  కేంద్ర ఎన్నికల బృందాన్ని ఆయన కలిశారు .

ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి అనేక సూచనలు చేశారు ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు ,( Chandrababu Naidu ) పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఎన్నికలు చివరి దశలో పెట్టాలని , అలాగే పోలింగ్ రోజే ఫలితాలు కూడా వెల్లడించాలని సీఈసీ ని కోరినట్లుగా పేర్కొన్నారు .

కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుందని,  కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. """/" / ఈ సందర్భంగా చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు .

కాపులు అందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు.అలాగే వంగవీటి రంగా ను చంపిన పార్టీతో కలవవద్దని,  ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కేఏ పాల్ పేర్కొన్నారు .

తనపై శత్రువులు విష ప్రయోగం చేసినా, దేవుని కృప,  వైద్యుల సహాయం తనను రక్షించాయంటూ కే ఏ పాల్ చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ కోసం రాని తారక్… ఎన్టీఆర్ రాకపోవడానికి అదే కారణమా?