ప్రజా పాలన అధికార పార్టీ కార్యక్రమంలా ఉండరాదు:నూనె వెంకట్ స్వామి

నల్లగొండ జిల్లా:గతంలో ప్రతి ప్రజాహిత ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) కార్యకలాపాలుగా మలిచినందునే ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకొని,ప్రజలకు దూరం కావాల్సి వచ్చిందని,అదే దారిలో ప్రస్తుత ప్రభుత్వం నడవరాదని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్)( PRPS ) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.

శనివారం ఆయన నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ఎనిమిదవ వార్డులో జరిగిన ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా పాలన( Praja Palana ) కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యే యొక్క భారీ సైజు ఫ్లెక్సీలు ప్రదర్శించి కార్యక్రమం నిర్వహించడం అభ్యంతరకరమన్నారు.

కేవలం ముఖ్యమంత్రి ఫోటో వరకే పరిమితం కావడం ప్రభుత్వ నిబంధనలలో ఉన్నదని, స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీలతో ప్రభుత్వ ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించడాన్ని తక్షణం నిలిపివేసి,ప్రభుత్వ నిబంధనలను పాటించాలని డిమాండ్ చేశారు.

ఆ సాంగ్ వచ్చే సమయానికి ప్రభాస్ థియేటర్ కు పంపాడు.. హంసా నందిని కామెంట్స్ వైరల్!