బడ్జెట్‌ : సినీ చరిత్రలో ప్రదీప్‌ సినిమాకు అరుదైన రికార్డ్‌

యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’.

కరోనా వల్ల ఆ సినిమా విడుదల ఆగిపోయింది.కరోనా వచ్చి ఉండకుంటే ప్రదీప్‌ మొదటి సినిమా విడుదల అవ్వడంతో పాటు హీరోగా రెండవ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది.

కాని ప్రదీప్‌ అదృష్టం బాగాలేదో మరేంటో కాని ఇప్పటి వరకు సినిమా విడుదలకు నోచుకోలేదు.

అయితే ఈ సినిమాకు మాత్రం అరుదైన రికార్డులు అందుతూనే ఉన్నాయి.ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట కారణంగా సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది.

అద్బుతమైన వ్యూస్‌ యూట్యూబ్‌లో ఆ పాటకు రావడం జరిగింది.కేవలం యూట్యూబ్‌లో మాత్రమే కాకుండా ఆడియో స్ట్రీమింగ్‌ యాప్స్‌లో కూడా ఆ పాటకు మంచి ఆధరణ దక్కింది.

ప్రముఖ మ్యూజిక్‌ సంస్థ ఈ సినిమా పాటలను కొనుగోలు చేసింది.ఆ సంస్థ కొనుగోలు చేసిన దానికి దాదాపుగా పది రెట్ల లాభం వచ్చి ఉంటుందని అంటున్నారు.

సినిమాకు రెండు కోట్లకు మించి బడ్జెట్‌ ఖర్చు అయ్యి ఉండదు అంటున్నారు.ఇప్పటి వరకు నీలి నీలి ఆకాశం పాటకు 200 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.

కనుక యూట్యూబ్‌ మరియు ఇతర ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చి ఉంటుంది.

అంటే ఒక్క పాటతో సినిమా బడ్జెట్‌ సగం రికవరీ అయ్యింది.ఇది నిజంగా ప్రపంచ రికార్డ్‌ అనుకోవచ్చు.

ప్రదీప్‌ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తాడో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 2, గురువారం 2024