స్వామి వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో యోగా సాధన

రాజన్న సిరిసిల్ల జిల్లా: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని( International Yoga Day ) పురస్కరించుకొని చంధుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అద్యక్షతన విద్యార్థిని, విద్యార్థుల చేత యోగ గురువు లింగంపెల్లి మధు సూచనలతో సాధన చేశారు.

అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.యోగా మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని,మన వారసత్వ సంపద అయినటువంటి భారతీయ యోగాను నేడు ప్రపంచదేశాలు ఆచరిస్తున్న వేళ ప్రతిఒక్క భారతీయునికి గర్వకారణమైన, మానసిక ఒత్తిడిని జయించడానికి, ముఖ్యంగా విద్యార్థులు చదువులో ఏకాగ్రతను పెంచడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఏఎన్ఎం పద్మ, ఆశావర్కర్లు, భాగ్యలక్ష్మి, ఏస్తెర,కవిత, మహిళా సంఘం సభ్యులు వివో మంజుల,గంగ,రజిత మరియు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మధుసూధన్, సుధాకర్, రాజు,ముకేష్,సతీష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 30, ఆదివారం 2024