విడాకులు అయినా తనను వదలను.. ప్రభుదేవా మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా( Prabhu Deva ) గురించి మనందరికి తెలిసిందే.

ఆయన తెరపై ఏ విధంగా ఉంటారో మనందరికీ తెలిసిందే.కానీ ఆయన తెర వెనుక ఎలా ఉంటారు.

ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి అన్న విషయాలు చాలా మందికి తెలియదు.కాగా ప్రభుదేవా జీవితంలో ఇద్దరు మహిళలు భార్య స్థానాన్ని పొందారు.

అందులో గతంలో ఈయన రామలత( Ramalatha ) ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కాగా అందులో ఒక అబ్బాయి టీనేజ్‌ లో మరణించాడు.

ఆ తర్వాత కొంత కాలానికి భార్యా భర్తల మధ్య విభేదాలు రావడంతో అవి కాస్త విడాకుల( Divorce ) వరకూ వెళ్లాయి.

అయితే విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం నయనతార అంటూ రమాలత ఆ మద్య మీడియా ముందు తెలిపింది.

"""/" / అనంతరం ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

2020లో ఫిజియోథెరపిస్ట్‌ హిమానీ సింగ్‌ ను వివాహం చేసుకోగా వీరికి ఒక పాప కూడా పుట్టింది.

తాజాగా ప్రభుదేవా మాజీ భార్య రమాలత ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

ప్రభుదేవాకు మా పిల్లలంటే ప్రాణం.వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు.

నా ఇద్దరు కొడుకులకు కూడా తండ్రితో మంచి అనుబంధం ఉంది.వారు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు నాతో పాటు ప్రభుదేవా అనుమతి అడుగుతారు.

ప్రభుదేవా సంగీత కచేరిలో నా పెద్ద కొడుకు రిషి డ్యాన్స్‌ అద్భుతంగా చేశాడు.

తండ్రి రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది.అందరూ వాడి డ్యాన్స్‌ చూసి ఆశ్చర్యపోయారు.

"""/" / అలా ఎలా చేయగలిగాడు? అని అడుగుతున్నారు.అతడు కేవలం రెండేళ్ల నుంచే డ్యాన్స్‌ నేర్చుకుంటున్నాడు.

హీరోగా కూడా అవకాశాలు వస్తున్నాయి.చిన్నవాడికి మాత్రం సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదు.

తను డాక్టర్‌ అవుతానంటున్నాడు.విదేశాలకు పంపించి బాగా చదివించాలనుకుంటున్నాము.

ప్రభుదేవాకు, నాకు విడాకులు అయ్యాయి.అంతమాత్రాన మా మధ్య ఎలాంటి గొడవలు లేవు.

పైగా నాకు, నా పిల్లలకు అతడే సపోర్ట్‌ గా నిలబడ్డాడు.ఎన్నడూ నా గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు.

అందుకే ఆయన్ని ఎప్పటికీ వదులుకోలేను.అయితే ఒంటరిగా పిల్లల్ని పెంచడం అనేది కష్టమే! ఆ కష్టాల్ని నేను అధిగమించాను.

మంచి తండ్రిగా ప్రభుదేవా నా పిల్లల కోసం ఎప్పుడూ నిలబడ్డాడు అని లత చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా రమా లతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.