ప్రభాస్ ఎపిసోడ్ కూడా రెండు పార్టులా..!
TeluguStop.com
ఆహా వారి తెలివి తేటలు ఓ రేంజ్ లో ఉన్నాయి.అన్ స్టాపబుల్ సీజన్ 2 తో అదరగొట్టేస్తున్న ఆహా త్వరలో ప్రభాస్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేస్తుంది.
మొన్నామధ్య ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమోతోనే సెన్సేషన్ సృష్టించిన ఆహా టీం ఇప్పుడు ఆ ఎపిసోడ్ ని ప్రమోట్ చేస్తుంది.
ఇందులో భాగంగా ప్రభాస్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కూడా రెండు పార్ట్ లుగా ప్లాన్ చేశారు.
డిసెంబర్ 30న ప్రభాస్ ఎపిసోడ్ ది బిగినింగ్.జనవరి 6న సెకండ్ ఎపిసోడ్ ది కన్ క్లూజన్ అని ఫిక్స్ చేశారు.
బాహుబలి ఫార్ములా బాగా ఫాలో అవుతున్న ఆహా టీం ప్రభాస్ ఇంటర్వ్యూని కూడా రెండు పార్ట్ లు చేసి షాక్ ఇచ్చింది.
ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఈ ఎపిసోడ్ కోసం నందమూరి ఫ్యాన్స్, సగటు సినీ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
"""/"/
ప్రభాస్ తో పాటుగా ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆహా టీం ప్లాన్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమినింగ్ కానుంది.
అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వస్తుందని తెలుస్తుని.
2023 జనవరి 13న సంక్రాంతికి ఈ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారని టాక్.