‘రామబాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్.. క్లారిటీ ఇచ్చిన గోపీచంద్!

మ్యాచో స్టార్ గోపీచంద్ ( Gopichand ) ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు.

అయితే ఇప్పటికి వరుస సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు.

ఈ క్రమంలోనే ఈయన హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.అందుకే ఒక్క హిట్ కోసం గోపీచంద్ పరితపిస్తున్నాడు.

మరి ప్రస్తుతం గోపీచంద్ లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో పని చేస్తున్నాడు.

గోపీచంద్ కెరీర్ లో ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ రేంజ్ లో మరో హిట్ అందుకోలేక పోయాడు.

అందుకే ఈసారి ఎలాగైనా సరే హిట్ అందుకోవాలని పరితపిస్తున్నాడు. """/" / డైరెక్టర్ శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''రామబాణం'' ( Ramabanam ).

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆడియెన్స్ ను అలరించాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది.

వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. """/" / అయితే ఈ సినిమా కోసం గోపీచంద్ స్నేహితుడు ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నాడు అని నిన్నటి నుండి నెట్టింట వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ రూమర్స్ పై గోపీచంద్ స్పందిస్తూ.ఎంత స్నేహితుడు అయిన కూడా పాన్ ఇండియా హీరోగా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్న తనని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదని.

అందుకే ప్రభాస్ ఈ ఈవెంట్ కు రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. """/" / దీంతో ముందు నుండి వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా ప్రభాస్ ( Prabhas ) వస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రావడం లేదని చెప్పి ఈ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చాడు.

కానీ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా నిరాశ చెందారు.ఇదిలా ఉండగా రామబాణం సినిమాను మే 5న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తుండగా.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.డింపుల్ హయతి ( Dimple Hayati ) హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక చుండ్రుతో నో టెన్షన్.. ఒక్క వాష్ లోనే వదిలించుకోండిలా!