రాబోయే 10 నెలల్లో ప్రభాస్ 3 సినిమాలు.. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే

ప్రభాస్ హీరో గా ప్రస్తుతం నాలుగైదు సినిమాలు రూపొందుతున్నాయి.ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఈ సమయం లో విడుదలకు సంబంధించిన అప్డేట్స్ అధికారికంగా రాలేదు కానీ రాబోయే పది నెలల కాలం లో వరుసగా మూడు సినిమాల తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

అందులో మొదటగా సమ్మర్ చివర్లో ఆదిపురుష్‌ సినిమా తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

హిందీ లో రూపొందిన ఆదిపురుష్‌ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

ఇక దసరా తర్వాత లేదా దసరాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నెలలో నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

"""/"/ మొత్తానికి ఈ మూడు సినిమాలు కూడా పది నెలల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో అభిమానులు పండగ చేసుకునే అవకాశం ఉంది.

ఈ మూడు సినిమాల విడుదల తేదీలు కన్ఫమ్ అయ్యాయి.అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి.

కాస్త అటు ఇటు తేదీలు మారే అవకాశాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అభిమానుల హృదయాలను గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ మూడు సినిమాలు ఉండి ప్రభాస్ ఇమేజ్ ని మరింతగా పెంచుతాయని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.

భారీ అంచనాల నడుమ పాన్ వరల్డ్‌ సినిమాగా రుపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సంక్రాంతి కి విడుదల అయితే ఇతర హీరోల సినిమాలేవి కూడా ప్రభాస్ సినిమా కు పోటీగా వచ్చే అవకాశం లేదు.

ఇక ఆదిపురుష్‌ మరియు సలార్ సినిమాలు ఏ స్థాయిలో వసూళ్లు రాబడతాయో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది.

మూడు సినిమాలు కూడా వేల కోట్ల రూపాయల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.