ప్రేక్షకులకు ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభాస్..!

ఒక్కసారి మాట ఇస్తే తప్పే అలవాటు లేదు అని టాలీవుడ్ లో ప్రూవ్ చేస్తున్న ఏకైక హీరో ప్రభాస్.

అనే చత్రపతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అనే డైలాగ్.

ఇది చాలా ఫేమస్ అయింది అప్పట్లో.దీనిని నిజం చేస్తూ ఇప్పుడు ప్రేక్షకులకు ఇచ్చిన ఒక మాట కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నాడు ప్రభాస్.

ఇంతకీ ప్రభాస్( Prabhas ) తన అభిమానులకు ఇచ్చిన మాట ఏంటి ? దాని కోసం ఎంత కష్టపడుతున్నాడు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / ప్రభాస్ తన అభిమానులకు ఇచ్చిన మాట ఏంటి అంటే ప్రతి ఆరు నెలలకు ఒక సినిమా ఇస్తాను అని.

బాహుబలి సినిమా కోసం తన కెరీర్లో ఎవరికి ఇవ్వనంత టైం అంటే ఏకంగా ఐదేళ్ల పాటు రాజమౌళి( Rajamouli ) కి చేశాడు.

ఆ తర్వాత సాహో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇది పూర్తవడానికి కూడా దాదాపు మూడేళ్ల సమయం పట్టింది.

ప్రేక్షకులు ఇలా పదేళ్లకు రెండు లేదా మూడు సినిమాలు తీస్తే ఎలా అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇకపై సినిమాలు ఎంత ఆలస్యంగా ఉండవని ఆరునెలల కోసం ఇచ్చి ప్రేక్షకులకు పండగ తెస్తానంటూ మాట ఇచ్చాడు.

"""/" / ఆయన చెప్పినట్టుగానే ఆరు నెలలకు సినిమా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

దానికోసం చాలానే కష్టపడుతున్నారు.2022 లో రాధే శ్యామ్ విడుదల అయింది అలాగే 2023 జూన్ లో ఆది పురుష్ విడుదల అయింది.

సరిగ్గా ఆరు నెలలకు అంటే డిసెంబర్ 27వ తారీకున సలార్ సినిమా రాగ ప్రేక్షకులు ప్రభాస్ కి ఒక విజయాన్నీ అందించారు.

ఇక ఇప్పుడు వచ్చే నెలలో కల్కి సినిమాతో మరోమారు కేవలం 6 నెలల గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇది అయిన వెంటనే సంక్రాంతికి రాజా సాబ్ కూడా రాబోతోంది.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం.

దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హను రాగవపూడి సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 సైతం చేయబోతున్నట్టుగా సమాచారం.

అంతర్జాతీయ విద్యార్ధులకు భారత్ శుభవార్త .. కొత్తగా రెండు స్పెషల్ వీసాలు