వచ్చే ఏడాది ఇదే రోజు 'సలార్' బాక్సాఫీస్ బ్లాస్టింగ్ చేయనుందా?
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన విషయం తెలిసిందే.
బాహుబలి సినిమా హిట్ తర్వాత ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
దీంతో ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.
ఈయన చేతిలో ఇప్పుడు నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.మారుతి తో చేసే సినిమా మినహా అన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలే.
వందల కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలపై ప్రేక్షకులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.
మరి ఆ సినిమాల్లో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.ఎందుకంటే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న నీల్ కెజిఎఫ్ తో సంచలనం సృష్టించాడు.
దీంతో ప్రభాస్ తో చేసే సలార్ సినిమా కూడా ఈ రేంజ్ లోనే ఉంటుంది అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
"""/" /
ఇక మొన్నటి వరకు ఆగిపోయిన ఈ షూట్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.
ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
సెప్టెంబర్ 28న అంటే సరిగ్గా ఇదే రోజు. """/" /
ఈ రోజు సెప్టెంబర్ 28, 2022.
ఏడాది తర్వాత సరిగ్గా ఇదే రోజు 2023, సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది.
మరి ఆ రోజు ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం.
ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.ఇక రిలీజ్ తర్వాత మరింత బాక్సాఫీస్ బ్లాస్టింగ్ చేయడం తప్పనిసరి.
చూడాలి ఇదే రోజు రిలీజ్ అయ్యి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో.
Super Slots (UK) — An Analytical Look At The Games, Banking And Trade-offs