Prabhas : ప్రభాస్ ఈ జీవితంలో పెళ్లి చేసుకోలేడు… ప్రభాస్ గురించి జోస్యం చెప్పిన రాజమౌళి?
TeluguStop.com
టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్( Prabhas ) ఒకరు.
యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈయన రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.
ఈ సినిమా ద్వారా ఈయన దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి( Marriage ) మాటే ఎత్తడం లేదు ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో పెళ్లి గురించి ఈయనని ప్రశ్నిస్తే సరదా సరదాగా సమాధానాలు చెబుతూ ఈ పెళ్లి విషయాన్ని పక్కకు మళ్ళి ఇస్తారు ఇక సీరియస్ గా పెళ్లి గురించి అడిగితే మాత్రం సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అంటూ సమాధానం చెబుతూ వస్తారు.
ఇలా పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా ప్రభాస్ మాత్రం సరైన సమాధానం చెప్పలేదు.
"""/" /
ఇక ఈయన హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే నటి అనుష్క( Anushka ) తో ఈయనకు రిలేషన్ ఉంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
వీరిద్దరూ కలిసి దాదాపు నాలుగు సినిమాలలో నటించారు.దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి ప్రభాస్ మేమిద్దరం మంచి స్నేహితులమని మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కొట్టి పారేశారు.
తాజాగా బాలీవుడ్ నటి కృతి సనన్( Kriti Sanon ) ప్రేమలో ప్రభాస్ ఉన్నారని ఇద్దరు పెళ్లికూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలు కూడా ప్రభాస్ కృతి ఇద్దరు కూడా కొట్టి పారేశారు.
ఇలా ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఎప్పుడు ఒక ప్రశ్నార్థకంగానే ఉండేదని చెప్పాలి అయితే తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ పెళ్లి గురించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పటివరకు ఈయన పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను రాజమౌళి బయట పెట్టారు.
"""/" /
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ప్రభాస్ ఈ జీవితంలో పెళ్లి చేసుకోలేరు అంటూ జోస్యం చెప్పారు.
అలా ఎందుకు చెప్పారో అనే విషయానికి వస్తే ప్రభాస్ కు చాలా బద్ధకం సోమరితనం అని ఈయన వెల్లడించారు.
ఇక ఎవరైనా కొత్త వాళ్లతో మాట్లాడాలి అంటే ప్రభాస్ చాలా మొహమాటపడతారు.ఇక జనాలు ఎక్కువగా ఉన్నచోట కూడా ఈయన ఉండాలి అంటే కూడా ఇబ్బందిగానే ఫీలవుతారు.
ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే ప్రభాస్ ఈ జీవితంలో పెళ్లి చేసుకోలేడు అంటూ ఈయన ప్రభాస్ పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎన్టీయార్ కెరియర్ ఇటు పోతుంది…దేవర ను మించి వార్ 2 ఉంటుందా..?