ప్రభాస్ శీను హీరో ప్రభాస్ కి దూరం కావడానికి అదే కారణమా.. నిజం బయటపెట్టిన కమెడియన్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో శ్రీను ఒకరు.

శీను అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ప్రభాస్ శ్రీను అంటే అందరూ టక్కున గుర్తుపడతారు.

ఈయన ప్రభాస్ కి స్నేహితుడు కావడమే కాకుండా కొన్ని రోజులపాటు ప్రభాస్ డేట్ చూసుకున్నారు.

అలాగే ప్రభాస్ తో కలిసి ప్రతి సినిమాలో చేయడం వల్ల ఈయనకు ప్రభాస్ శీను అనే పేరు వచ్చింది.

ఇలా ప్రభాస్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ కి శీనుకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఆ మనస్పర్ధలు కారణంగానే ప్రభాస్ తనని దూరం పెట్టారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా కృష్ణంరాజు మరణించిన తర్వాత అక్కడ ప్రభాస్ శీను పెద్ద ఎత్తున హడావిడి చేశారు.

ఈ క్రమంలోనే మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శీను ప్రభాస్ తో తనకు వచ్చిన దూరం గురించి అసలు విషయం వెల్లడించారు.

ప్రభాస్ ప్రస్తుతం పెద్ద స్టార్ కావడం వల్ల తనని వదిలేసారని తనని దూరం పెట్టారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రాసేవారికి పని పాట లేదు అందుకే ఇలాంటి వార్తలను సృష్టిస్తూ ఉంటారు.

అందరూ అనుకున్నట్లుగా ప్రభాస్ కు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవని. """/"/ తాను పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ మా ఇద్దరి మధ్య అదే స్నేహబంధం కొనసాగుతుందని అయితే ఇద్దరం ఈమధ్య సినిమాలలో మాత్రమే నటించలేదు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ శీను వెల్లడించారు.

సినిమాలలో నటించలేనంత మాత్రాన గొడవలు వచ్చాయనడం కరెక్ట్ కాదు.ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయినా తనకు మాత్రం స్నేహితుడిని ఇప్పటికీ మా ఇద్దరి మధ్య అదే ఫ్రెండ్షిప్ కొనసాగుతుందని తెలిపారు.

ఇక ప్రభాస్ శీను ఇద్దరు కూడా వైజాగ సత్యానంద గారి ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నామని, అప్పటినుంచి తనకు మంచి స్నేహితుడు అంటూ ఈ సందర్భంగా ఈయన తనకు ప్రభాస్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.

ఆ విషయంలో నేను నిరాశకు గురయ్యాను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!