ఆయన లేకుంటే నేను లేను.. ప్రభాస్ మూలంగానే తన కెరీర్ కొనసాగుతుందన్న స్టార్ కమెడియన్..

ప్రభాస్ శ్రీను.తెలుగు సినిమా పరిశ్రమలో మాంచి టైమింగ్ ఉన్న కమెడియన్.

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.ఈయన కామెడీకి జనాలు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే.

అయితే శ్రీను.ప్రభాస్ శ్రీను ఎలా అయ్యాడు అనే డౌట్ మనలో చాలా మందికి ఉంటుంది.

ఎందుకు అలా మారాడు అనే విషయాన్ని స్వయంగా శ్రీను విశేషం.అయితే శ్రీను ప్రభాస్ క్లాస్ మేట్ అట.

ఇంతకీ వీరిద్దరు ఎక్కడ కలిసి చదువుకున్నారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీనుకు చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా అబ్బలేదు.అయితే పలు నాటకాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో బాగా పాల్గొనేది.

ఈ విషయాన్ని తన తండ్రి గమనించాడు.ఇదే విషయాన్ని తన మిత్రులకు చెప్పాడు.

అయితే మిత్రుల సూచనతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేర్పించాడు.కొద్ది రోజులు అక్కడ నటనలో మెలకువలు నేర్చుకున్నాడు.

కానీ తనకు ఎలాంటి అవకాశాలు రాలేదు.అయితే ఇక్కడ కాకుండా స‌త్యానంద్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుంటే అవకాశాలు వస్తాయని చెప్పారు.

కెరీర్ కూడా బాగుంటుందని చెప్పారు. """/"/ అదే సమయంలో శ్రీను నాన్న ఆర్డీవోగా ప‌ని చేస్తున్నాడు.

ఆయ‌న రిక‌మెండేష‌న్ చేయ‌డంతో స‌త్యానంద్ శ్రీనుకు శిక్ష‌ణ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.ఆ బ్యాచ్‌లో న‌లుగురు ఉండేవాళ్ల‌ట‌.

అందులో ప్ర‌భాస్ కూడా ఒక‌డు.ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘ‌వేంద్ర సినిమాలో శ్రీను కూడా నటించాడు.

ఆ తర్వాతే తను ప్రభాస్ శ్రీనుగా మారిపోయాడు.ప్రభాస్ లేకపోతే తాను ఇండస్ట్రీలో లేను అని శ్రీను చాలా సార్లు చెప్పాడు.

"""/"/ ఆయన మూలంగానే తనకు ఎన్నోఅవకాశాలు వచ్చినట్లు వెల్లడించాడు.ఆయన పేరును నా పేరుకు ముందు పెట్టుకోవడం అంటే తనకు ఎంతో గొప్పగా అనిపిస్తుందని చెప్పాడు శ్రీను.

తను సినిమా పరిశ్రమలో కొనసాగినంత కాలం ప్రభాస్ తన మదిలో నిలిచే ఉంటాడని చెప్పాడు.

ఆయన లేనితే తాను లేనని తేల్చి చెప్పాడు ప్రభాస్ శ్రీను.

అన్నయ్యా.. నా గుండె బద్ధలైంది.. రవితేజ ఫ్యాన్ ఎమోషనల్ లెటర్ వైరల్!