Prabhas : ఆ పని చేసి స్టంట్ మాస్టర్ కు అదిరిపోయే షాక్ ఇచ్చిన స్టార్ హీరో ప్రభాస్.. ఏమైందంటే?
TeluguStop.com
టాలీవుడ్ హీరో ప్రభాస్( Tollywood Hero Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.కాగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
ప్రస్తుతం డార్లింగ్ చేతిలో రాజాసాబ్, స్పిరిట్( Spirit ), సలార్ 2, కల్కి లాంటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్.
గత ఏడాది సలార్ మూవీ( Salaar Movie )తో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్.
ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం ప్రభాస్ తన తదుపరి సినిమా కల్కి సినిమా షూటింగ్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు రానుంది.
"""/"/
ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు ఇప్పటికే విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అనంతరం రాజా సాబ్ సినిమా( Rajasaab ) కూడా విడుదల కానుంది.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.
అదేమిటంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా( Mr.Perfect ) సమయంలో ప్రభాస్ కు సినిమాలో ఒక పాటలో బండి అలా అలా స్టైల్ గా తిప్పే శీను ఒకటి ఉంటుంది.
"""/"/
అయితే మామూలుగానే ప్రభాస్ అందరితో చాలా సరదాగా పంచులు వేస్తున్న వేస్తూ ఉంటారు.
అదే అదునగా భావించిన ఆస్ట్రేలియా స్టంట్ మాస్టర్( Australian Stunt Master ) 500 కేజీలు బరువు కలిగిన ఆ బైకును మేనేజ్ చేయడం ప్రభాస్ వల్ల కాదు అని ప్రభాస్ ని తక్కువ అంచనా వేశారట.
కానీ ప్రభాస్ ఆ సినిమా పాట షూట్ జరుగుతున్న సమయంలో ఆ బండిని ఈజీగా తిప్పి ఆ స్టంట్ మాస్టర్ కు షాక్ ఇచ్చారు.
అప్పుడు ఆ స్టంట్ మాస్టర్ ప్రభాస్ ని చాలా తక్కువ అంచనా వేశాను అని అన్నారట.
దేవర బ్యూటీ దశ తిరిగిందిగా.. ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కిందా?