రామ్ చరణ్ తో కలిసి తప్పకుండా సినిమా చేస్తా… ప్రభాస్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నటిస్తున్నటువంటి చిత్రాలలో ప్రాజెక్ట్ కే ఒకటి.

ఇక ఈ సినిమాకి తాజాగా టైటిల్ కూడా అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసింది కల్కి 2898 ఏడీ(Kalki 2898AD) అనే టైటిల్ అనౌన్స్ చేశారు.

అదే విధంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా విడుదల చేశారు.కామిక్ కాన్ (Comic Con) ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. """/" / అనంతరం ప్రభాస్ ఈ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ తన సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజమౌళి(Rajamouli) రామ్ చరణ్(Ramcharan) వంటి వారి గురించి కూడా మాట్లాడారు.

ఇండియాలో ఉన్నటువంటి అద్భుతమైన డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు.ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి RRR సినిమాకు ఆస్కార్ రావడం విశేషం అందుకు ఆయన అర్హుడు అంటూ తెలిపారు.

"""/" / ఇలా రాజమౌళి గురించి ప్రశంసలు కురిపించినటువంటి ప్రభాస్ అనంతరం రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడారు.

ఇక రాంచరణ్ తనకు చాలా మంచి స్నేహితుడని తెలిపారు.అయితే ఏదో ఒక రోజు నేను రామ్ చరణ్ తో కలిసి తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ వ్యాఖ్యలు బట్టి చూస్తే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్ రాబోతుందని మెగా అభిమానులు అటు ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లలో ఫ్లాపైనా అక్కడ మాత్రం హిట్.. విశ్వక్ సేన్ సెలక్షన్ కు తిరుగులేదుగా!