సలార్ వాయిదా పడుతుందా.. అందుకే సైలెంట్ అయ్యారా..!
TeluguStop.com
ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ రీసెంట్ గా వచ్చి నిరాశపరచింది.ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
అయితే ఆ సినిమా తర్వాత వస్తున్న సలార్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ అంతా హోప్స్ పెట్టుకున్నారు.
వారి అంచనాలకు తగినట్టుగానే ప్రశాంత్ నీల్ సలార్( Prashanth Neel ) సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది.ప్రభాస్ అంత క్లియర్ గా కానరాకపోయినా సరే సలార్ తో మరో సంచలనం సృష్టించబోతున్నాడని ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు.
"""/" /
అయితే సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అని ఫిక్స్ చేశారు.
ఆల్రెడీ ఆగష్టు వచ్చేసింది.సలార్ లాంటి భారీ బడ్జెట్ సినిమా అది కూడా రెండు భాగాలుగా వచ్చే సినిమాకు ఇంతవరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.
సినిమా రిలీజ్ ఇంకో నెలన్నర మాత్రమే ఉండగా సలార్ టీం చాలా వెనుకపడి ఉంది.
అయితే దీనికి కారణం ప్రభాస్ సలార్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని అందుకే మేకర్స్ ప్రమోషన్స్ లైట్ తీసుకున్నారని అంటున్నారు.
మరి ప్రభాస్ సలార్( Salaar ) అనుకున్న టైం కి వస్తుందా రాదా అన్నది త్వరలో తెలుస్తుంది.
రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..