హమయ్య సలార్‌ సేఫ్‌…. క్రాకర్స్ కాల్చుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్( Prabhas ) హీరోగా కేజీఎఫ్‌ స్టార్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్( Prashanth Neil ) దర్శకత్వం లో రూపొందిన సలార్‌ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.యూట్యూబ్‌ లో సలార్‌ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.

అందుకే ఈ సినిమా కి భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.

"""/" / అయితే సినిమా కి పోటీగా డుంకీ సినిమా ( Dunki Movie )పోటీ ఉండటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది.

ఇద్దరు హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సలార్‌ సినిమా ట్రైలర్‌ విడుదల అయిన తర్వాత సాధించిన రికార్డుల ను తీసుకుని, డుంకీ సినిమా ట్రైలర్ రికార్డులను పోల్చి చూస్తే.

ఏమాత్రం షారుఖ్ ఖాన్‌ ప్రభావం చూపించలేక పోయాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

డుంకీ ట్రైలర్‌ చూసిన తర్వాత హమయ్య ఇది మా సలార్ సినిమా ( Salaar Movie )కు పోటీనే కాదు అంటూ చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / సోషల్‌ మీడియా లో ఇదే విషయాన్ని గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లో ప్రస్తుతం క్రాకర్స్ కాల్చుతూ మరీ ఫ్యాన్స్ సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉన్నారు.

ప్రభాస్ సలార్‌ సినిమా తో క్రిస్మస్‌ విజేతగా నిలవడం ఖాయం అని చాలా మంది అంటున్నారు.

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్ ( Shah Rukh Khan )డుంకీ సినిమా కు అంత సీన్ లేదు అంటున్నారు.

షారుఖ్ గత చిత్రాల మాదిరిగా డుంకీ వెయ్యి కోట్లు వసూళ్లు సాధిస్తుందని అనుకుంటున్నారు.

కానీ ట్రైలర్‌ చూస్తూ ఉంటే అంత వసూళ్లు సాధించడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.

అందుకే ప్రభాస్‌ ఫ్యాన్స్ మా సలార్‌ సేఫ్‌ అనుకుంటూ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024