సలార్ సెన్సేషన్.. అప్పుడే బుకింగ్స్ లో ఆ రికార్డ్.. డార్లింగ్ క్రేజ్ అంటే ఇది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్( Hollywood ) రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ ( Prabhas )నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ కెరీర్ లో ఇదైనా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు.మరి ఈ సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్ కాబోతుంది.

దీంతో మేకర్స్ వేరే రేంజ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ప్లే చేస్తున్నారు.

"""/" / ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా యునామినస్ స్పందన లభించింది.ఈ టీజర్ తర్వాత మరో అప్డేట్ రాలేదు.

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో యుఎస్ బాక్సాఫీస్ దగ్గర బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయ్యాయి.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా 36 రోజులు ఉండగానే బుకింగ్స్ స్టార్ట్ అవ్వడంతో బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసారు.

"""/" / అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇన్ని రోజులు ఉండగానే అప్పుడే లక్ష 30 వేల డాలర్స్ మార్క్ ను టచ్ చేసినట్టు తెలుస్తుంది.

దీంతో సలార్ కి యూఎస్ లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.

మరి రిలీజ్ నాటికీ ఈ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.సలార్ 3 మిలియన్ డాలర్స్ మార్క్ ను జస్ట్ ప్రీమియర్స్ తోనే టచ్ చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

వైరల్ వీడియో: స్కూల్‌ కారిడార్‌లో గుండె నొప్పి.. అక్కడిక్కడే మృతి చెందిన బాలుడు..?